మూడో రోజూ లాభాలే

బిజినెస్‌
29 Views

బడ్జెట్‌ రోజు భారీ నష్టం తర్వాత.. వరుసగా మూడో రోజూ సూచీలు లాభపడ్డాయి. ఈ 3 ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,407 పాయింట్లు (3.54%), నిఫ్టీ 427.30 పాయింట్ల (3.66%) మేర పెరగడం విశేషం. బడ్జెట్‌ రోజు అతిగా స్పందించిన సూచీలను యథాతథ స్థితికి తీసుకొచ్చేందుకు మదుపర్లు ప్రయత్నించారు. జనవరిలో సేవల రంగ కార్యకలాపాలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను నేడు వెల్లడించనున్న నేపథ్యంలో రేట్ల ఆధారిత షేర్లు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా ఇదే బాటలో నడిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 1 పైస లాభపడి 71.24 వద్ద ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *