బీపీసీఎల్‌పై రాస్‌నెఫ్ట్‌ ఆసక్తి

బిజినెస్‌
26 Views

దిల్లీ: బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌)ను స్వాధీనం చేసుకోవడంపై రష్యా ప్రభుత్వ నిర్వహణలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ రాస్‌నెఫ్ట్‌ ఆసక్తిగా ఉందని సమాచారం. ఇందుకోసమే చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాస్‌నెఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఐగోర్‌ సెచిన్‌ బుధవారం కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇంధన వినియోగంలో మూడో అతిపెద్ద, శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత విపణిలో మరింత విస్తరించాలని రాస్‌నెఫ్ట్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశీయంగా రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రిఫైనరీ నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌)లో మెజారిటీ వాటా (49.13 శాతం) ను రాస్‌నెఫ్ట్‌ స్వాధీనం చేసుకుంది కూడా. మంత్రి ప్రధాన్‌ను ఉదయం అల్పాహార విందులో కలిసిన సెచిన్‌, తదుపరి తమ బృందంతో కలిసి భారత అధికారులతో చర్చించారు. బీపీసీఎల్‌లో భారత ప్రభుత్వ వాటా (52.98 శాతం)ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ వేస్తామని ఈ సందర్భంగానే వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వరంగ రిఫైనరీకి స్థిరపద్ధతిలో ముడిచమురు సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్‌కు వచ్చిన సెచిన్‌, ఇక్కడ మరిన్ని పెట్టుబడులకు ఆసక్తి చూపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *