ప్రకటనల వ్యయం రూ.82,795 కోట్లు

బిజినెస్‌
104 Views

ముంబై: దేశంలో ఆర్థిక మందగమనం ప్రకటనల వ్యయాన్ని ప్రభావితం చేస్తోంది. గతేడాది ప్రకటనల వ్యయం కేవలం 9 శాతం వృద్ధితో రూ.82,795 కోట్లకు చేరుకుంది. 2019 సంవత్సరంలో వృద్ధి 12 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆర్థిక మందగమనంతో అంచనాలు తలకిందులయ్యాయి. 2020 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి దశాబ్దకాల కనిష్ఠ స్థాయిలో 5 శాతానికి చేరుకోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఏడాదిలో పరిస్థితి మారుతుందని, ప్రకటనల వ్యయం 10.7 శాతం వృద్ధి చెంది రూ.91,641 కోట్లకు చేరుకోవచ్చని మీడియా బయ్యింగ్‌ దిగ్గజం గ్రూప్‌ ఎం నివేదిక అంచనా వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *