హెచ్‌డీఎఫ్‌సీ సంక్రాంతి కానుక…!

బిజినెస్‌
37 Views

ప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా హెచ్‌డీఎఫ్‌సీ కొత్త తనిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ తాజాజా బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పుడు కేవలం 5 బేసిస్ పాయింట్ల మేర మాత్రమే బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును తగ్గించింది. అయితే దీని కన్నా ముందు ఎస్‌బీఐ తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటులో ఏకంగా 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు 7.8 శాతానికి దిగొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల కోత హోమ్ లోన్స్‌కు వర్తిస్తుంది. హౌసింగ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు తగ్గింపుతో హెచ్‌డీఎఫ్‌సీ అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఈ తగ్గింపు నిర్ణయం జనవరి 6 నుంచి అమలులోకి వస్తుంది. తాజా రేట్ల తగ్గింపు నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.2 శాతం నుంచి ప్రారంభమౌతోంది. వడ్డీ రేటు 9 శాతం వరకు కూడా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయంతో ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *