వికలాంగులను కేంద్రం పట్టించుకోవడం లేదు

తెలంగాణ
100 Views

హైదరాబాద్‌
వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు.రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి దయనీయంగా ఉందనీ, వారి బాగోగుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆవేధన వ్యక్తం చేశారు. వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం స్త్రీ శిశు సంక్షేమం, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహిస్తున్న మనో వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని అవయవాలు సరిగ్గా ఉండి, సమాజానికి హాని తలపెట్టే వారే అసలైన వికలాంగులన్నారు. అనేక మంది బిడ్డలు వారు చేయని తప్పులకు మానసిక వికలాంగులుగా ఉన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వికలాంగుల సమస్యలను తీసుకువెళ్లి న్యాయం చేస్తామన్నారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్న వీరిని పెంచడం తల్లిదండ్రులకు సవాల్‌గా మారిందనీ, వేరే వ్యాపకం లేకుండా వీరిని చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. అనుకోకుండా వారి జీవితంలో మానసిక వికలాంగులుగా ఉండడం దయనీయ పరిస్థితి అని అన్నారు. వీరిని పెంచడం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. ఎన్జీవోల సహకారంతో మానసిక వికలాంగుల కోసం హైదరాబాద్‌ తో పాటు మూడు, నాలుగు జిల్లాలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్‌, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ, ఉమెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సబిత, రంగారెడ్డి జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ మోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *