పాముకాటుతో మహిళ మృతి కేసులో కొత్త ట్విస్ట్… పోలీసులకే షాక్…

క్రైమ్
147 Views

మధ్యప్రదేశ్‌లో అమితేశ్ పటారియా, శివానీ భార్యాభర్తలు. పటారియా ఓ బ్యాంక్ మేనేజర్. ఆదివారం శివానీ చనిపోయింది. కన్నీళ్లు పెడుతున్న భర్తను ఓదార్చిన చుట్టుపక్కల వాళ్లు ఎలా జరిగింది అని అడిగితే… పాము కరిచింది అని చెప్పాడు. ఆమె చేతిలో పాము కాటు వేసినట్లు ఉన్న గుర్తుల్ని వాళ్లకు చూపించాడు. అది చూసి… అవును పాము కాటే అని నలుగురూ… మాట్లాడుకున్నారు. పోలీసులు ఎంటరయ్యారు. చుట్టూ చూశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ రిపోర్టులో కొత్త విషయం తెలిసింది. ఏంటంటే… పాము ఆమెను బతికి ఉన్నప్పుడు కాటెయ్యలేదు. చనిపోయిన తర్వాత కాటేసిందని తెలిసింది. మరైతే ఆమె ఎలా చనిపోయింది? ఆమెను గొంతు పిసికి, నులిమేయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పింది. పోలీసులకు మనుషులు చెప్పే దానికంటే రిపోర్టుల్లో చెప్పినదానిపైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో, మళ్లీ వెళ్లి… “రేయ్ ఇటు రారా” అని పిలిచారు. పోలీసుల స్వరంలో మార్పు వచ్చేసరికి పటారియాకు వణుకు మొదలైంది. “మేము నిన్ను కొట్టడం, ఒళ్లంతా బొబ్బలెక్కడం, ఆ తర్వాత నిజం కక్కడం… ఇదంతా అవసరమా… స్ట్రైట్‌గా అసలు విషయం చెప్పేయ్” అన్నారు. బ్యాంక్ మేనేజర్ కదా… నాటకాలాడి లాభం లేదని అర్థం చేసుకున్నాడు. తనే తన భార్యను చంపేశానన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *