రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫర్‌

ఆంధ్రప్రదేశ్
93 Views
  • రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫర్‌
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కోసం రెండు వాహనాలు ప్రారంభం

రాజమహేంద్రవరం : రండి బాబు రండి.. కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యం ఇస్తాం రండి.. మీ ఇంట ఉన్న ప్లాస్టిక్‌ ఇవ్వండి.. బియ్యం తీసుకెళ్లండి.. ఇది రాజమహేంద్రవరం నగర పాకల సంస్థల ప్రత్యేక ఆఫర్‌. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టే చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరం నగర ప్రజలకు దీన్ని ప్రకటించింది. దీనికోసం రెండు ప్రత్యేక వాహనాల్లో నగరవ్యాప్తంగా ప్రజల ఇళ్ల ముంగిటకే వచ్చి ఆగనున్నాయి. స్వచ్ఛసర్వేక్షణ్‌-2020 సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఇళ్లల్లోని ప్లాస్టిక్‌ను సేకరించడానికి నిర్దేశించిన రెండు ప్రత్యేక వాహనాలను నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ గురువారం ప్రారంభించారు. ఇకనుంచి ఈ రెండు వాహనాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తాయని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసి ఈ ప్రత్యేక వాహనాలకు అప్పగించాలన్నారు. ఒక కిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇస్తే ఒక కిలో బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాలు రోడ్లపైన, డ్రైన్లలోను పారవేయకుండా నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఓం ప్రకాష్‌, ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ వినూత్న, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *