గెలుపు కోసం.. కొత్త గేమ్ ఆడుతున్న టీం ఇండియా

క్రీడలు
173 Views

గతంలో ఛేజింగ్ ఆటలు గ్రామాల్లో అనేకం చూసి ఉంటాం. అందులో ముఖ్యంగా పరుగెత్తుకుంటూ.. ముందున్న వారిని టచ్ చేయడం ఆట.. దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇవే ఆటలను ఆడుతుంది టీం ఇండియా. అవును మీరు విన్నది నిజమే. టీం ఇండియా ఏంటీ.. ఇలా గ్రామాల్లో ఆడే ఆటలు ఆడటం ఏంటి అనుకుంటున్నారా.. బుధవారం ఉప్పల్ స్టేడియంలో టీం ఇండియా సభ్యులు ఆడిన గేమ్స్‌ చూస్తే.. మీకే తెలుస్తుంది.

మొత్తం టీం ఇండియా ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయారు. ఓ బృందం ముందు వరుసలో నిలబడింది. ఆ తర్వాత వారి వెనక మరో బృందం నిలబడింది. ముందున్న వాళ్లు.. వారి షార్ట్స్‌లో ఒక ఎరుపు రంగు చేతి రుమాలు పెట్టుకున్నారు. ఇక వెనక ఉన్నవారు.. పసుపు రంగు కర్చీఫ్‌తో ఉన్నారు. అయితే ఇలా నిల్చున్న తర్వాత.. గేమ్ ట్రైనర్‌ విజిల్‌ వేశారు. అంతే.. అంతా పరుగెత్తుకుంటూ వెళ్లారు. అయితే ఈ గేమ్‌లో.. తమ ముందు నిలబడ్డ ఆటగాడిని అందుకోవడమే వెనక ఉన్నవారి పని. అయితే అదే సమయంలో.. వెనక ఉన్న సభ్యుడికి దొరక కుండా వేగంగా పరుగెత్తడం ముందున్న సభ్యుడి పని. ఇలా ఆడటం ద్వారా అనుకోకుండా సభ్యుల్లో వేగంగా పరుగెత్తడం అలవాటైపోతుంది. ప్రస్తుతం మన టీం ఇండియా సభ్యులు ఈ ఆటను ఆడుతున్నారు. ఇలా చేస్తే ఆటగాళ్లలో రన్నింగ్ వేగం పెంచవచ్చని.. టీమిండియా స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ ఆలోచన. అయితే దీనికి టీమిండియా పెట్టుకున్న పేరు ‘ఛేజ్‌ డ్రిల్‌’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *