గంగూలీ ఖాతాలో మరో రికార్డు!

క్రీడలు
107 Views

తాజాగా భారత క్రికెట్లో సౌరవ్ గంగూలీ మరో అడుగు ముందుకేసే నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆసియా ఎలెవన్ వరల్డ్ ఎలెవన్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించేందుకు గంగూలీ సిద్ధమయ్యాడు. ఈ స్టేడియంలో తొలి మ్యాచ్ని నిర్వహించేందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ ఎలెవన్ vs ఇండియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్కి ఈ స్టేడియం ఆతిధ్యం ఇవ్వబోతుంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ అంటే ఆస్ట్రేలియాలో ఉన్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అని అందరూ చెప్తారు. కానీ ఇప్పుడా ఆ ఎంసీజీని తలదన్నే స్టేడియంలో ఇండియాలోని అహ్మదాబాద్ లో నిర్మిస్తున్నారు. మొతెరాలో ఉన్న స్టేడియాన్ని తొలగించి అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి 700 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చును గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ భరిస్తోంది. మొతెరా స్టేడియం అందుబాటులోకి వస్తే.. మెల్బోర్న్ రికార్డును అధిగమించడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *