సెన్సార్‌ ఇబ్బందుల్లో 90 ఎంఎల్‌.గట్టెక్కటం కష్టమేనా.???

సినిమా
161 Views

సినిమా మేకింగ్‌, కథా కథనాల్లో వస్తున్న మార్పులు కలెక్షన్ల పరంగా ఎంత ప్లస్‌ అవుతున్నాయో, అంతే స్థాయిలో వివాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా బోల్డ్‌, వివాదాస్పద కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` సినిమా ఈ విషయంలో సమస్యలు ఎదుర్కొంటుండగా తాజాగా మరో తెలుగు సినిమా కూడా ఈ లిస్ట్‌లో చేరింది.

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఈ బోల్డ్ హీరో తాజాగా నటిస్తున్న సినిమా 90 ఎంఎల్‌. కథా కథనాల పరంగా బోల్డ్ కంటెంట్‌ కాకపోయినా సినిమా టైటిల్‌ మాత్రం కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉండేలా ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకుడు. ఈ సినిమాను కార్తికేయ హోం బ్యానర్‌లో అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. అయితే ఇంత వరకు ఈ సినిమా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి కాలేదు. ఇప్పటికే సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు కొన్ని ఆడియో, వీడియో కట్స్‌ సూచించారు. అయితే చిత్రయూనిట్ సెన్సార్‌ టీం చూపించిన అన్ని కట్స్‌కు సుముఖంగా లేదని అందుకే సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *