2019లో అత్యంత అందగాడు అతనే!

సినిమా
145 Views

బాలీవుడ్ ప్రపంచంతోపాటు అక్కడి తారలకు ఎంతో ప్రత్యేకత ఎప్పటి నుంచో ఉంది. ఈ ఏడాది ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు దేశ విదేశాల్లోనూ విజయాన్ని సాధించి రికార్డులు బద్దలుకొట్టాయి. అయితే వాటిలో ‘వార్’, ‘సూపర్-30’ సినిమాలు విదేశాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో హరో ‘హృతిక్ రోషన్’. ఈ విజయాలను సాధించిన హృతిక్ రోషన్ మరో ఖ్యాతిని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా హృతిక్ రోషన్ ‘సెక్సీయస్ట్ ఏషియన్ మేల్ ఆఫ్ 2019’గా ఎంపికయ్యారు. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో హృతిక్ రోషన్ ఈ ఘనత దక్కించుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 45 ఏళ్ల హృతిక్ ‘సెక్సీయస్ట్ ఏషియన్ మేల్’ పట్టికలో టాప్‌లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఓట్ల ఆధారంగా హృతిక్‌కు పట్టం కట్టారు. ఈ సందర్బంగా హృతిక్… తనకు ఓట్లు వేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *