తెలంగాణ ఆర్టీసీలో పెరిగిన బస్సు చార్జీలు – బస్ పాస్ చార్జీలు లిస్ట్ ఇదే

తెలంగాణ
90 Views

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చల్లారింది, ఉద్యోగులు ఉద్యోగాల్లో చేరి బస్సులు నడిపిస్తున్నారు, ఈ సమయంలో యూనియన్ల జోలికి వద్దు నేను మీకు సాయం చేస్తా అని కేసీఆర్ ప్రగతి భవన్ కు డిపోల నుంచి ఉద్యోగులతో భేటీ అయ్యారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ ఆర్టీసీతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఎంతో కాలంగా చార్జీల రేట్లు పెంచకుండా ఉన్న ఆర్టీసీ తాజాగా రేట్లు పెంచారు. ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన బస్ చార్జీలు అమలు కానున్నాయి. ఆర్టీసీ అన్ని బస్సు సర్వీసుల్లో కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. మరి చార్జీలు చూద్దాం.

పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంచారు
సెమీ ఎక్స్ప్రెస్ కనీస చార్జీ రూ.10గా చేశారు
ఎక్స్ ప్రెస్ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంచారు
డీలక్స్ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20 చేశారు
సూపర్ లగ్జరీ కనీస చార్జీ రూ.25
రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35
గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35
గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35
ఇక వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.75

ఇక బస్సు పాసులు పెరిగిన వాటి వివరాలు చూస్తే

సిటీ ఆర్డీనరీ బస్పాస్ చార్జీ రూ. 770 నుంచి రూ.950పెంచారు..
మెట్రో బస్ పాస్ రూ. 880 నుంచి రూ.1,070కి ఆర్టీసీ పెంచింది
మెట్రో డీలక్స్ బస్పాస్ చార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచింది
స్టూడెంట్ బస్పాస్ రూ.390 నుంచి రూ.495కి పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *