వాతావరణ పరిస్థితుల్లో కుదురుకోలేక పోయాం

క్రీడలు
95 Views

ఆస్ట్రేలియాలోని వాతావరణ పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా కుదురుకోవడంతోబాటు బ్యాట్స్‌మన్ మంచి భాగస్వామ్యాలను సాధించడం పాకిస్తాన్‌కు ప్రస్తుతం అత్యంత కీలకమని ఆ జట్టు సారధి అజహర్ అలీ సోమవారం నాడిక్కడ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు అత్యంత బాధాకరమైన టెస్టు రికార్డు ఉందని, దానిని అధిగమిస్తామన్న విశ్వాసం తమకుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ జట్టు ఇటీవల అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
అంతకు ముందు బ్రిస్‌బేన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను సైతం ఇన్నింగ్స్ 5 పరుగుల భారీ తేడాతో కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రత్యేకించి ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన గత 14 వరుస టెస్టు మ్యాచుల్లో పాకిస్తాన్ పరాజయం పాలై దారుణమైన రికార్డును సంతరించుకుంది. ఈక్రమంలో మాట్లాడిన అజహర్ అలీ పరిస్థితులను అధిగమించి విజయాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ప్రధానంగా విదేశీ కండిషన్స్‌కు యువ క్రీడాకారులు అత్యంత వేగంగా అలవాటుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ బ్యాటింగ్ కండిషన్స్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాయని, బంతి బౌన్స్ అయ్యేతీరుకు అనుగుణంగా బ్యాట్స్‌మెన్ ఫుట్‌వర్క్ ఇతర కదలికలు ఉంటే పరుగుల వరద పారించవచ్చన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *