రూ.10 లక్షల కోట్లకు రిలయన్స్‌ మార్కెట్‌ విలువ తొలి భారతీయ కంపెనీగా రికార్డు

బిజినెస్‌
43 Views

రూ.10 లక్షల కోట్లకు
రిలయన్స్‌ మార్కెట్‌ విలువ
తొలి భారతీయ కంపెనీగా రికార్డు
దిల్లీ

షేర్లు నమోదైనప్పుడు అతడు రాజకుమారుడు

తండ్రి తదనంతరం యువరాజు కాస్తా రాజయ్యాడు..

ఒక్కడు గా మిగిలినా ‘బ్రాండు’ విశిష్ఠతను నిలబెట్టేందుకు మహర్షిలా వ్యాపార యజ్ఞం చేశాడు.

ఇప్పుడు అతనో అగ్రగామి బిజినెస్‌మేన్‌..

అపర శ్రీమంతుడు..

విత్తనం నం.1 అయితే.. చెట్టు నం.1 కాకుండా ఉంటుందా

అతనే కాదు.. రికార్డులు కొల్లగొట్టడంలో అతని కంపెనీ ఖలేజా ఉన్నదే..

దూకుడు అంటే ఏమిటో రుచి చూపిస్తూ.. రూ.10,000 కోట్ల త్రైమాసిక లాభాన్ని ఆర్జించిన భారతీయ తొలి ప్రైవేట్‌ కంపెనీగా నిలిచింది

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ అని నిరూపిస్తూ షేరు మార్కెట్‌ విలువ

రూ.10,00,000 కోట్లకు చేరింది. ఆ వ్యక్తే ముకేశ్‌ అంబానీ.. ఆ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చిరస్మరణీయ రికార్డును నెలకొల్పింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ ఆర్‌ఐఎల్‌ కావడం గమనార్హం. గురువారం ట్రేడింగ్‌ ముగిసే నాటికి బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.10,01,555.42 కోట్లుగా నమోదైంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల సమీపంలోనే ఉంటూ వస్తోంది. అయితే నిన్న షేరు 0.65 శాతం పెరిగి రూ.1579.95 వద్ద నమోదవడంతో కంపెనీ చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ముఖ్యంగా గత 8 రోజులుగా షేరు 8 శాతం మేర రాణించడం ఇందుకు కారణమైంది. కేవలం 25 ట్రేడింగ్‌ రోజుల్లోనే ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు చేరడం విశేషం. ఈ ఏడాది అక్టోబరులో తొలిసారి రూ.9 లక్షల కోట్ల మైలురాయిని కంపెనీ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *