రెడ్ మీ కొత్త చార్జర్…17 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

బిజినెస్‌
98 Views

రెడ్ మీ నోట్ 8కు పూర్తి చార్జింగ్ ఎక్కించగల చార్జర్ ను షియోమీ తీసుకొచ్చింది. చైనాలో జరిగిన షియోమి డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ 100W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ 17 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని షియోమీ తెలిపింది. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఈ చార్జర్ పనిచేసే విధానాన్ని కూడా షియోమీ చూపించింది. వివో ఈ సంవత్సరం అందుబాటులోకి తీసుకువచ్చిన 120W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి పోటీగా షియోమీ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివో 120W ఫాస్ట్ టెక్నాలజీ షియోమీ కంటే వేగంగా 13 నిమిషాల్లోనే 4000 ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుంది. వివోకి పోటీగా ఒప్పో 65W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని, రియల్ మీ 50W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. రియల్ మీ ఎక్స్2 ప్రోతో ఈ టెక్నాలజీని రియల్ మీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 100W టెక్నాలజీకి సంబంధించి షియోమీ ఒక డెమో వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో చూపించిన దాని ప్రకారం షియోమీ సూపర్ చార్జ్ టర్బో టెక్నాలజీ ద్వారా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ పూర్తిగా చార్జింగ్ ఎక్కగా..

ఒప్పో SuperVOOC 50W టెక్నాలజీ ద్వారా 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యమున్న ఒప్పో స్మార్ట్ ఫోన్ 65 శాతం చార్జింగ్ ఎక్కింది. ఈ టెక్నాలజీ ద్వారా రెడ్ మీ నోట్ 8, రెడ్ మీ నోట్ 7 సిరీస్ ఫోన్లు, రెడ్ మీ కే20 మొబైల్స్ ను 20 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఈ చార్జర్ లో 9-ఫోల్డ్ చార్జ్ ప్రొటెక్షన్ ను అందించారు. ఇందులో 7-ఫోల్డ్ ప్రొటెక్షన్ మదర్ బోర్డ్ కి కాగా, మిగతా 2-ఫోల్డ్ బ్యాటరీకి అందిస్తారు. అయితే ఈ చార్జర్ ను ఏ స్మార్ట్ ఫోన్ కు అందిస్తారనే విషయాన్ని షియోమీ ఇంకా తెలపలేదు. వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకువచ్చే షియోమీ ఫ్లాగ్ షిప్ మొబైల్స్ లో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చే స్మార్ట్ ఫోన్లలో దీన్ని అందించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *