బాలీవుడ్ హీరో కుమారుడిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..!

సినిమా
89 Views

బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ తాప్సీ.. “నో ఫిల్టర్ నేహా” అనే షోలో పాల్గొన్న తాప్సీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్థన్ కపూర్‌ను టార్గెట్ చేస్తూ ఓ విషయాన్ని ప్రస్తావించారు. హర్షవర్ధన్ కపూర్ తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. కానీ, రెండో సినిమాలో అవకాశం వచ్చిందని.. అతడు స్టార్ హీరో కుమారుడు కాబట్టే.. రెండో సినిమాలో అవకాశం దక్కిందని.. అదే స్థానంలో నేను ఉంటే అలా జరిగేది కాదని.. అసలు కెరీరే పూర్తిగా ఉండకుండా పోయేదని చెప్పుకొచ్చారు.

అనిల్ కపూర్ కుమారుడు, సోనమ్ కపూర్ సోదరుడైన హర్షవర్ధన్ కపూర్ 2016 లో రాకీష్ ఓంప్రకాష్ మెహ్రా యొక్క మిర్జ్యాతో తొలిసారిగా నటించాడు.. కానీ, ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండేళ్ల తరువాత భవేష్ జోషి సూపర్ హీరో అనే చిత్రంలోనూ నటించాడు.. ప్రస్తుతం అభినవ్ బింద్రా బయోపిక్ కోసం పని చేస్తున్నాడు.. ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు..

అయితే.. వర్షవర్ధన్ కపూర్ విషయాన్ని ప్రస్తావించిన తాప్సీ.. తొలి చిత్రం ఘోర పరాభవం తర్వాత రెండో చిత్రం పొందడం చాలా కష్టం.. నేను అతని స్థానంలో ఉంటే, నాకు రెండవ చిత్రం లభించదు అని వ్యాఖ్యానించిడం.. బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.. అసలు హర్షవర్ధన్ కపూర్‌నే తాప్సీ ఎందుకు టార్గెట్ చేసింది అని ఆరా తీసేవారు కూడా లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *