యువ క్రికెటర్‌ గా నసీమ్‌ షా రికార్డు.. సచిన్ రికార్డు బద్దలు

క్రీడలు
86 Views

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు 86.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో పాక్ తరుపున తొలి టెస్ట్ ఆడుతున్న పేసర్ నసీమ్‌ షా నయా రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల 279 రోజుల అత్యంత చిన్న వయసులో ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన టెస్టు క్రికెటర్‌గా నసీమ్‌ షా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఇయాన్‌ క్రెయిగ్‌ పేరిట ఉంది. ఇయాన్‌ క్రెయిగ్‌ 17 ఏళ్ళ వయసులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. నసీమ్‌ షా పాకిస్తాన్ దేశవాళీ మ్యాచ్ లలో సత్తా చాటడంతో అతనికి జాతీయ జట్టులో స్థానం లభించింది. తన తొలి టెస్ట్ లో నసీమ్‌ షా 7 పరుగులు చేశాడు. 15 ఏళ్ల 279 రోజుల అత్యంత చిన్న వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన నసీమ్‌ షా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో చిన్న వయసు లోనే టెస్ట్ క్రికెట్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు హాసన్ రాజా తొలి స్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో ఐదు మంది పాక్ ఆటగాళ్లు ఉండటం విశేషం. 1) హాసన్ రాజా (పాకిస్తాన్)- 14 ఏళ్ల 227 రోజులు 2) ముస్తాక్ మహమ్మద్ (పాకిస్తాన్)- 15 ఏళ్ల 124 రోజులు3) మహమ్మద్ షరీఫ్ (బంగ్లాదేశ్)- 15 ఏళ్ల 128 రోజులు 4) నసీమ్‌ షా (పాకిస్తాన్)- 15 ఏళ్ల 279 రోజులు 5) అకిబ్ జావేద్ (పాకిస్తాన్)- 16 ఏళ్ల 189 రోజులు 6) సచిన్ టెండూల్కర్ (ఇండియా)- 16 ఏళ్ల 205 రోజులు 7) అఫ్తాబ్ బలోచ్ (పాకిస్తాన్)- 16 ఏళ్ళ 221 రోజులు తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్ల వరకు పాక్ వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. మసూద్-అజర్ అలీ సమర్ధవంతంగా ఆసీస్ బౌలింగ్ ను ఎదురుకున్నారు.

ఆసీస్ కెప్టెన్ పైన్ బౌలింగ్ లో ఎన్ని మార్పులు చేసినా ప్రయోజనం లేకపోయింది.జట్టు స్కోరు 75 పరుగుల వద్ద మసూద్(27) తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ వెంట వెంటనే పాక్ వరుస విరామాలతో వికెట్స్ నష్టపోయింది. అజర్ అలీ(39), సోహైల్(1), బాబర్ అజాం(1) ఔట్ కావడంతో పాక్ స్కోరు 78/4కు చేరుకుంది. జట్టు స్కోరుకు 16 పరుగులు జోడించిన తరువాత ఇఫ్తికార్ అహ్మద్(7) వెనుదిరగడంతో 94 పరుగులకు ఐదవ వికెట్ ను ప్యాకేజ్ జట్టు నష్టపోయింది.

ఈ దశలో అసద్ షఫీక్-రిజ్వాన్ కలిసి షాట్లతో అలరించారు. ఈ జోడి 6వ వికెట్ కు 49 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రిజ్వాన్(37) పెవిలియన్ చేరాడు. యాషిర్ షా సహకారం అందించడంతో అసద్ షఫీక్ జట్టు స్కోరును 200 పరుగుల మార్క్ దాటించాడు.

ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా చేశాడు.7వ వికెట్ కు 84 పరుగులు జోడించిన తరువాత యాషిర్ షా(27)ని స్టార్క్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే షాహిన్ ఆఫ్రిది(0), అసద్ షఫీక్(76) ఔట్ కావడంతో 227 పరుగులకే 9 వికెట్లు నష్టపోయింది. చివిరి వికెట్ కు నసీమ్‌ షా-ఇమ్రాన్ ఖాన్ 13 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 240 పరుగులకు చేరింది. నసీమ్‌ షా(7) పెవిలియన్ చేరడంతో పాక్ తొలి ఇన్నింగ్స్ 240 పరుగుల వద్ద ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ 5 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *