రైతుబజార్లలో 25కే ఉల్లి: సీఎం

ఆంధ్రప్రదేశ్
86 Views

రాష్ట్రంలోని రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.25కే సరఫరా చేయాలని సీఎం జగన్‌ మార్కెటింగ్‌ శాఖను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులతో పంట ఉత్పత్తుల ధరలు, కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధరలు బాగా పెరిగినందున రైతుబజార్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, నెల రోజుల పాటు కిలో పాతిక రూపాయలకే అమ్మాలని అధికారులకు సూచించారు. రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లి సరఫరా చేయాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా వేరుశనగ, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు సాగేలా చూడాలని సీఎం ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఈ నెల 25 నుంచి ప్రారంభించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *