విలవిల్లాడిన ప్రయాణికులు… అధికారుల తీరుపై అసహనం

ఆంధ్రప్రదేశ్
8 Views

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముమ్మిడివరం నియోజకవర్గ పర్యటనతో 216 జాతీయరహదారిపై గురువారం ట్రాఫిక్‌ను బ్లాక్‌ చేయ డంతో ప్రయాణికులు పడ్డ కష్టాలు వర్ణనా తీతం. ఇదే అదునుగా చేసుకుని ఆర్టీసీ నాన్‌స్టాప్‌ టిక్కెట్లను టిక్కెట్‌కు రూ.30 అదనంగా పెంచి సొమ్ములు చేసుకున్నారు. కొమానపల్లిలో జాతీయ రహదారిని ఆనుకుని బహిరంగ సభా వేదిక ఏర్పాటు చేయడంతో అటు కాకినాడనుంచి, ఇటు అమలాపురం నుంచి వెళ్లే వాహనాలన్నిం టినీ ఉదయం 6 గంటలనుంచే దారి మ ళ్లించారు. దీంతో ప్రయాణికుల కష్టాలు దారు ణంగా మారాయి. అమలాపురం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులను అంబాజీపేట, రావులపాలెం, మండపేట, రామచంద్రపురం మీదుగా కాకి నాడకు మళ్లించారు. ఆర్టీసీతోపాటు అన్ని వా హనాలను దారి మళ్లించిన పోలీసు అధికారుల తీరుతో ప్రయాణికులు పలుచోట్ల పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. అమలాపురంనుంచి కాకినాడకు నాన్‌స్టాప్‌ బస్సు టిక్కెట్‌ ధర రూ.65 ఉంటే రూ.95కు పెంచడంతో ఆర్టీసీ ఉద్యోగులతో ప్రయాణికులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *