ఆర్టీసీపై ఎటూ తేల్చని ప్రభుత్వం..

తెలంగాణ
89 Views

ఆర్టీటీ కార్మికులు సమ్మె విరమించి రెండు రోజులైంది. కానీ, ప్రభుత్వం సమ్మె విరమించిన తరువాత వారిని ఆర్టీసిలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యధాతథ స్థితిలో వాళ్ళను విధుల్లోకి తీసుకున్నా ఆర్టీసీని నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకొని ఏం చేయాలనే ధోరణిలో ఆలోచిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆర్టీసీని నడిపించాలంటే కనీసం రూ. 624 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

అంత డబ్బు ఆర్టీసీ దగ్గర లేదు. ప్రభుత్వం భరాయించే స్థితిలో లేదు. అందుకే ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. లేదంటే, ఇప్పటికిప్పుడు బస్సు చార్జీలు పెంచాలని, ఆ చార్జీలను ప్రయాణికులు భయాయిస్తారా అంటే అదీ కష్టమే. దీనిపైనే నిన్నటి రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీలో కార్మికులను చేర్చుకునే విషయంపై ఆలోచనలో పడ్డారు.

అయితే, రాష్ట్రంలో 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులను అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. లేదంటే ప్రభుత్వం మరేదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ కోర్టు ప్రైవేట్ రూట్లకు అనుమతి ఇవ్వకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి.

ప్రైవేట్ రూట్లను అనుమతి ఇవ్వకుంటే, ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకొని బస్సులను నడుపుతారా లేదంటే దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తారా.. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే.. సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ ఇప్పుడప్పుడే తేలదు. కార్మికులు సమ్మె విరమించినా, విధుల్లోకి తీసుకోలేదనే అపవాదు కెసిఆర్ కు వస్తుంది. ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఆర్టీసీ కార్మికుల జీవితాలు ఆధారపడి ఉండొచ్చు. మరి తీర్పు ఎవరికీ అనుకూలంగా వస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *