శ్రీశైలం డ్యామ్ పై అనుమానాలొద్దు – మంత్రి అనిల్

ఆంధ్రప్రదేశ్
9 Views

శ్రీశైలం ప్రాజెక్టు, ఆనకట్ట భద్రత పై ఎలాంటి అనుమానాలొద్దని, వాటికీ ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం ఆనకట్ట(డ్యామ్) పై పగుళ్లుతో ప్రమాదం జరుగుతుందని వార్తలొస్తున్న నేపథ్యంలో నవంబర్ 21, గురువారం నాడు అధికారులతో చర్చించి, నివేదికలు తెప్పించుకున్నారు. ఆనకట్ట భద్రత పై అన్ని చర్యలు తీసుకుంటున్నామని,ఈ విషయంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అని ఆయన చెప్పారు. శ్రీశైలం ఆనకట్టపై ప్రజల్లో అనవసరపు అనుమానాలు, అపోహలు కల్పించవద్దని మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

మరో వైపు శ్రీశైలం ఆనకట్ట పర్యవేక్షక ఇంజినీరు చంద్రశేఖర్ స్పందిస్తూ, ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. శ్రీశైలం జలాశయం సురక్షితంగానే ఉందని సీడబ్ల్యూసీ ఇప్పటికే నిర్ధరించిందని చెప్పారు. అలాగే ప్లంజ్‌ పూల్‌ సర్వే నివేదికలు వచ్చిన వెంటనే ఆనకట్ట భద్రత విషయాన్ని కమిటీ ముందు ఉంచుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *