చంద్రబాబు చేతిలో.. ఆ మాజీ మంత్రికి అంత అవమానమా..?

రాజకీయం
10 Views

దేవినేని ఉమామహేశ్వరరావు .. మాజీ మంత్రి .. తెలుగుదేశం సర్కారు హయాంలో ఒక వెలుగు వెలిగాడు . చంద్రబాబు కూడా ఆయనకు ప్రయారిటీ ఇచ్చి జలవనరుల శాఖ అప్పగించారు . అయితే ఇప్పుడు సీన్ మారిపోయిందా .. చంద్రబాబు కూడా దేవినేనిని పక్కకు పెట్టేశారా .. అందుకే మొన్నటి ఇసుక దీక్షలో దేవినేనికి చంద్రబాబు పక్కన స్థానం దక్కలేదా .. అవునంటున్నారు కొందరు వైసీపీ నాయకులు .

దేవినేని ఉమా ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడని .. అతని ప్రవర్తనతో చంద్రబాబునే కాకుండా ఆఖరికి అతని తండ్రిని కూడా తిట్టించుకునే పరిస్థితికి దేవినేని ఉమ దిగజారిపోయాడని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు . దేవినేని ఉమను ప్రజలు గెంటేశారు .. టీడీపీ ఒక పక్కకు నెట్టేసిందన్నారు . అందుకే చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష వేదికపై కూర్చుంటే కిందకు తోసేశారన్నారు .

ప్రజలు చిత్తుగా ఓడించిన దేవినేని ఉమకు ఇంకా బుద్ధిరాలేదన్నారు . పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజల చేత రోజూ తిట్టించుకుంటున్నాడన్నారు . సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పోలవరం వెనుకబడి పోయిందని దేవినేని ఉమ మాట్లాడడం సిగ్గుచేటన్నారు . వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని , కృష్ణా , గోదావరి జలాలు పారుతుంటే ఇసుక ఎలా తీస్తారని ప్రశ్నించారు . పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలల స్వప్నమని , ఆయన కుమారుడు సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు .

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు . అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ .. పోలవరం త్వరలోనే పూర్తిచేస్తామని వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు . దేవినేని ఉమ 2018 కల్లా పూర్తి చేస్తాం .. రాసుకో అని మాట్లాడాడని , ఎంతమేర పూర్తిచేశారని ప్రశ్నించారు . పోలవరం సోమవారం అని చెప్పి చంద్రబాబు , దేవినేని ఉమ ముడుపులు తీసుకున్నారన్నారు . నచ్చిన వారిని , టీడీపీ కార్యకర్తలను వేలాది బస్సుల్లో పోలవరం సందర్శనకు తీసుకెళ్లి వందల కోట్లు దుర్వినియోగం చేశారని వసంత కృష్ణప్రసాద్‌ మండిపడ్డారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *