నేడు “స్పందన” భవన నిర్మాణమునకు భూమి పూజ

న్యూస్
130 Views

బనగానపల్లి, నవంబర్ 19, ( సీమ కిరణం న్యూస్) :
పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో స్పందన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తున్నట్లు మంగళవారం సీఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు నిర్వహించి భూమి పూజ కోసం పోలీస్ స్టేషన్ ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. సీఐ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉన్నత అధికారుల సూచనలతో స్టేషన్ అవరణంలో స్పందన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టి వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.ఈ భూమి పూజకు సంబంధిత అధికారులతో పాటు ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి,డిఐజి పి. వెంకటరామిరెడ్డి,జిల్లాకలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ పకీరప్ప హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో
ఎస్ఐలు జి.కృష్ణమూర్తి ,డి.మహేష్ కుమార్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *