భోపాల్ ఇస్తేమాకు ప్రత్యేక రైలు

న్యూస్
154 Views

ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్ , పోచా బ్రహ్మానందరెడ్డి పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్ 19, ( సీమ కిరణం న్యూస్) :
నవంబర్ 21వ తేదీ నుండి మధ్య ప్రదేశ్లోని భోపాల్లో జరగనున్న అంతర్జాతీయ ముస్లింల ఇస్తెమా కు కర్నూల్ నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు కర్నూలు ఎంపీ డాక్టర్ సం జీవ్ కుమార్ ,నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో వారిరువురూ కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్, దక్షిణ మధ్య రైల్వే హెచ్ ఓడి .సామేలు క్రిస్టఫర్ ను కలిసి ఎంపిలిద్దరు వినతి పత్రం సమర్పించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన వారిరువురూ భోపాల్ ఇస్తేమా కోసం కర్నూలు జిల్లాలోని ముస్లిం సోదరులకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ రైలు కర్నూలు నుండి ఈ నెల 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు భోపాల్ కు బయలుదేరుతుందని, తిరిగి ఈనెల 25వ తేదీన భోపాల్ నుండి కర్నూల్ కు బయలుదేరు తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన కర్నూలు జిల్లా నుండి భోపాల్ లో జరిగే ఇస్తే మా కు ప్రతి ఏటా వేలాది మంది ముస్లిం సోదరులు హాజరవుతారు. ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో భోపాల్ ఇస్తే మాకు హాజరయ్యే ముస్లిం సోదరులకోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని పలు ముస్లిం సంఘాలు, ముస్లిం మత పెద్దలు కర్నూలు, నంద్యాల ఎంపీ లను కోరడంతో వారు ఇవాళ ఢిల్లీలో రైల్వే అధికారులను కలిసి మంజూరు చేయించడం జరిగింది. కర్నూలు నుండి భోపాల్ ఇస్తే మా కు వెళ్లే ముస్లిం సోదరుల కోసం ప్రత్యేక రైలు మంజూరు చేయించిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి లను ముస్లిం మత పెద్దలు ముస్లిం సంఘాల నాయకులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *