సాంకేతిక సమస్యలను దూరం చేస్తాం

న్యూస్
25 Views

ఆదోనిమార్కెట్‌: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్ సుధాకర్‌ మంగళవారం పర్యటించారు. యార్డు మొత్తం కలియ తిరిగి పంట దిగుబడుల వివరాలను, ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని మార్కెట్‌ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రంలో అంతర్జాలంలో నెలకొని ఉన్న సాంకేతిక సమస్యలను దూరం చేస్తామన్నారు. ఇందుకు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ టాటా కన్సల్టెన్సి సర్వీస్ సంస్థతో సమస్యల అధిగమనకు ఒప్పందం చేసుకున్నామ న్నారు. మూత పడిన రైతు రాయితి భోజనం ఇస్కాన్ సంస్థ ద్వారా పునప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో యార్డు కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కృష్ణారెడ్డి, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *