ఐటీ కంపెనీలు బానిసల్లా చూస్తున్నాయంటున్న టెకీలు…!

తెలంగాణ
122 Views

హైదరాబాద్ లోని పలు కంపెనీలలో పనిచేస్తున్న టెకీలు హైకోర్టు తలుపు తట్టారు. సెలవులు ఇవ్వటం లేదని, పనిగంటలు అధికంగా ఉన్నాయని ఐటీ కంపెనీలపై కోర్టును ఆశ్రయించారు. ఫోరమ్ ఎగైనెస్ట్ కరెప్షన్ అనే స్వచ్చంధ సంస్థ అధ్యక్షుడు విజయ్ గోపాల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ను దాఖలు చేసినట్లు సమాచారం. హైకోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ విషయమై వివరణ ఇవ్వాలని మూడు ఐటీ కంపెనీలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు అందాయని సమాచారం.

నాలుగు వారాల గడువులోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు తీర్పును అక్టోబర్ నెలకు వాయిదా వేసింది. పిటిషన్ లో విజయ్ ఏడాదికి ఇవ్వాల్సిన 45 రోజుల సెలవులు సరిగా ఇవ్వటం లేదని, వారంలో 48 గంటలు అధికంగా పని చేయించుకుంటూ పనికి తగిన వేతనం చెల్లించటం లేదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఐటీ కంపెనీలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా విస్మరిస్తున్నాయని హైకోర్టుకు విన్నవించినట్లు సమాచారం.

2002 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోను అడ్డుపెట్టుకొని కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. 2002లో ఐటీ అభివృధ్ధి కోసం ఇచ్చిన వెసులుబాటును ఇప్పటికీ సడలించలేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలు రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవటం, 48 గంటలు అధికంగా పని చేయించుకోవటం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్ ప్రకారం చట్ట విరుధ్ధమని పేర్కొన్నట్లు తెలుస్తుంది.

టెకీలు ఐటీ కంపెనీలు బానిసల్లా చూస్తున్నాయని చెబుతున్నారు. వ్యక్తిగత జీవితంపై వర్క్ అవర్స్, కంపెనీల ట్యాక్స్ పాలసీల ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ లో ప్రయాణానికే 4 నుండి 5 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. కొన్ని కంపెనీలు రోజుకు 10 గంటల వరకు పని చేయించుకుంటున్నాయని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *