రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

5 Viewsహైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు సమావేశమై ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జులై […]

Continue Reading

వరంగల్లో 9 మంది మరణాలకు కారణం ఇదే..!

6 Viewsవరంగల్‌ రూరల్‌ : వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఉన్న ఒక గోనె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో లభించిన 9 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. వరంగల్ ఎంజీఎం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం వారు నీటిలో మునగడం వల్ల చనిపోయినట్టు నిర్ధారించారు. 9 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా, అందులో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించాయి. రెండు డెడ్ బాడీల్లోని ఊపిరితిత్తుల్లో నీరు కనిపించలేదు. వారి శరీరం మీద […]

Continue Reading

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఐఏఎస్‌లు

5 Viewsఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 2019-బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువ ఐఏఎస్‌ అధికారులను సీఎం అభినందించారు. నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అని.. చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు.

Continue Reading

మిమిక్రీ గొంతు మూగబోయింది.. హరికిషన్ కన్నుమూత

6 Viewsప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు సినీ, రాజకీయ నాయకుల వాయిస్‌ను మిమిక్రీ చేసి హరికిషన్ ప్రాచుర్యం పొందారు. 1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. 1971లో విజయవాడలో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ స్పూర్తితో ఆయన మిమిక్రీ రంగంలోకి అడుగుపెట్టినట్లు చెబుతుండేవారు. దేశ విదేశాల్లో […]

Continue Reading

ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది వెంటనే భర్తీ: జగన్

5 Viewsఅమరావతి: ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీ స్థాయి వరకు కోవిడ్‌ టెస్టింగ్‌ శాంపిళ్లు సేకరణ, ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. 8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న దానికంటే ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్య పెంచాలని సూచించారు. కరోనా సోకడం నేరం, పాపం కాదు, భయాందోళనను తొలగించాలని […]

Continue Reading

కూకట్ పల్లిలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదు

4 Viewsహైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కూకట్ పల్లిలో కొత్తగా మరో 2 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. రెండురోజుల క్రితం కరోనాతో చనిపోయిన వృద్ధుని డ్రైవర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. రెయిన్ బో విస్టా […]

Continue Reading

ఫీవర్ ఆస్పత్రి చెత్తబుట్టలో పసికందు

9 Viewsఓ ఆసుపత్రి వద్ద చెత్తబుట్టలో పసికందు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. ఫీవర్ ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డులో డస్ట్ బిన్‌లో పసికందు లభ్యం అయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎవరో గుర్తు తెలియని మహిళ పసికందును వదిలి వెళ్ళిపోయిందని తెలిపారు. ఉదయం 5:30 ప్రాంతంలో బురఖాలో వచ్చిన గుర్తు తెలియని మహిళ, శిశువును డస్ట్ బిన్‌లో పడవేసినట్లుగా గుర్తించారు. ఈ రోజు […]

Continue Reading

కూతురి పెళ్లి వివాదం… భర్తను చంపిన భార్య

6 Viewsకూతురు పెళ్లి వివాదం కారణంగా ఆ దంపతులిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఆ వివాదాలు చివరకు భార్య భర్తను హత్య చేసే వరకు వెళ్లాయి. ఇటీవల తన భర్తను తానే హత్య చేసి ఎవరో చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అయితే కేసు విచారణను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… మృతుడి భార్యే అతడిని హత్య చేసిందని తేల్చారు. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గురందొరపాలెంకు చెందిన చిరంజీవి, సన్యాసమ్మలు ఇటీవల […]

Continue Reading

టీడీపీ తీరుపై కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఫైర్‌

9 Viewsకర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వైఎస్సార్‌ సీపీ విజయ దుందుభి మోగించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలను నవరత్నాల ద్వారా తొమ్మిది మాసాలలోనే సీఎం జగన్‌ పరిష్కరించారని చెప్పారు. తమ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తూ.. విద్య, […]

Continue Reading

టీడీపీ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌

5 Viewsతాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాది లోపే మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. 2019 మే 23 సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు

Continue Reading