ప్రతి పౌరుడిని ఆదుకుంటాం: అమిత్ షా

5 Viewsన్యూ ఢిల్లీ : ఉగ్ర రూపంతో విరుచుకుపడుతున్న ఉంపన్‌ తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము కూడా ఎప్పటికప్పుడు అంఫన్ తుపాను బీభత్సంపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తుపాను బాధిత రాష్ట్రాలైనా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రతి పౌరుడిని ఆదుకునే […]

Continue Reading

‘రాజధాని తరలింపునకు రూ.100 కోట్లకు మించి ఖర్చు కాదు’

5 Viewsఅమరావతి: రాజధాని తరలింపునకు రూ. 100 కోట్లకు మించి ఖర్చు కాదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజధాని తరలింపు విషయానికి సంబంధించి తమ ప్రస్తావన తెచ్చిన పిటిషన్ అంశంపై ఇంప్లీడ్ కావాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులు విధులకు హాజరయ్యారని చెప్పారు. హైదరాబాదులో ఉన్న వారు విధులకు హాజరుకాలేకపోయారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Continue Reading

ఐటీలో సత్తాచాటిన తెలంగాణ

5 Viewsహైదరాబాద్‌ : కరోనా కష్ట కాలంలోనూ తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం సమర్పించారు. 2019-20 ఏడాదిలో జాతీయ జాతీయ వృద్ది రేటు 8.9శాతంగా నమోదు కాగా.. రాష్ట్ర ఎగుమతులు 17.93 […]

Continue Reading

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి నడవనున్న రైళ్ల జాబితా ఇదే..

6 Viewsసికింద్రాబాద్: జూన్ 1 నుంచి ప్రజా రవాణాను దశలవారీగా అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా.. జూన్ 1 నుంచి రోజుకు 200 ఏసీ, నాన్‌ ఏసీ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. జనరల్ బోగీల్లో ప్రయాణించాలన్నా టికెట్‌ను ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకోవాల్సిందేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాకపోకలు సాగించనున్న రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే […]

Continue Reading

టీటీడీ జేఈవోగా మహిళా అధికారిణి

5 Viewsతిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి మహిళా అధికారిగా ఐఏఎస్ అధికారిణి ఎస్. భార్గవి నియమితులయ్యారు. టీటీడీ వైద్యం, విద్య విభాగాలకు ఆమె జేఈవోగా బాధ్యతలను స్వీకరించారు. 2015లో ఐఏఎస్‌కు సెలక్ట్ అయ్యారు. ఆమె నియామకానికి సంబంధించి మే 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. టీటీడీలో హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలను చూడడానికి ఓ మహిళా అధికారిని నియమించడం ఇదే తొలిసారి.

Continue Reading

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు…!

6 Viewsఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురందించారు సీఎం జగన్. గత రెండు నెలలుగా ఏభై శాతం జీతాలు మాత్రమే తీసుకోవలసి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ రకంగా పూర్తి జీతాలు ఇచ్చే రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన […]

Continue Reading

రేపు, ఎల్లుండి జర జాగ్రత్త.. ఏపీకి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ…!

5 Viewsఏపీలో ఎండలు మండుతున్నాయి.. రేపటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. వడగాల్పుల ముప్పు కూడా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకోనున్నాయని పేర్కొంది. ఇక ఇప్పటికే గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నిన్న రెంట చింతలలో ఏకంగా 47.2 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో ఇక్కడ అత్యధికంగా 48 డిగ్రీల […]

Continue Reading

తెలంగాణలో పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేస్తాం- శ్రీనివాస్‌గౌడ్‌

5 Viewsహైదరాబాద్‌: తెలంగాణ కు పర్యాటకులను ఆకర్షించడానికి మరింతగా పర్యాటక స్థలాలను అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణలో నిర్మిస్తున్న మినీ శిల్పారామం, మినీ టాంక్‌బండ్‌ ల అబివృద్ధి పై తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి, సుందరీకరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న మినీ […]

Continue Reading

సంక్షేమ పథకాలు ఎత్తేసేందుకు కేసీఆర్‌ తాపత్రయం: రేవంత్‌రెడ్డి

7 Viewsజగిత్యాల: సంక్షేమ పథకాలు ఎత్తేసేందుకు కేసీఆర్‌ తాపత్రయపడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు ఇవ్వనంటున్న కేసీఆర్‌.. చెప్పిన పిల్లను పెళ్లి చేసుకోకపోతే కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వనంటారేమోనని ఎద్దేవాచేశారు. ఎవరు ఏ పంట వేయాలో చెప్పడానికి కేసీఆర్‌ ఎవరు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ బరితెగించారని మండిపడ్డారు. సినిమాలు చూసి బోరుకొట్టి జనం కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు చూస్తున్నారని తెలిపారు. న్యాయవాదులకు ఇచ్చినట్టుగానే జర్నలిస్టులకు రూ.10వేలు ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్ చేశారు.

Continue Reading

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు: ఐఎండీ హెచ్చరిక

5 Viewsహైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వచ్చే మూడురోజులు పాటు రెండు రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. విజయవాడలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. అలాగే నిజామాబాద్‌లో 42 డిగ్రీలు, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిబిక్కిరి అవుతున్నారు.

Continue Reading