డీఎస్పీ స్థాయి అధికారి ఆత్మహత్య

8 Viewsకరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో పోలీసులు అధికారులు, యంత్రాంగం మొత్తం లాక్‌డౌన్‌ను అమలు చేసే పనుల్లో బిజీగా ఉంది.. కంటిమీద కునుకులేకుండా.. కొందరు అధికారులు, పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.. ఈ సమయంలో.. డీఎస్పీ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు కృష్ణ వర్మ.. ఉన్నట్టుండి ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.. విశాఖ బీచ్‌ రోడ్‌లోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని […]

Continue Reading

రైతుకు మంచి ధర దక్కేలా చట్టంలో మార్పులు

10 Viewsఢిల్లీ : పండించిన పంటలకు రైతులకు మంచి ధర దక్కేలా నిత్యావసర వస్తువుల చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3 వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రకటించారు. మీడియా ద్వారా ఆమె వివరాలను వెల్లడిస్తూ… ఈసీ యాక్ట్‌ 1955లో సవరణలు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు మెరుగైన ధరలు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాలు, తినదగిన నూనెలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయాలు, […]

Continue Reading

6 వేల ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీఎస్ఆర్టీసీ వేటు

11 Viewsఇటీవల ప్రభుత్వ సంస్థగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా కష్టకాలంలో తేరుకోలేని షాకిచ్చింది. ఏకంగా 6 వేల మంది ఉద్యోగులు విధులకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను ఆయా మేనేజర్ల ద్వారా జారీ చేయించింది. అదీకూడా మే 15వ తేదీ శుక్రవారం నుంచే హాజరుకావొద్దంటూ అందులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉద్యోగులందరినీ తొలగించామని ఆర్టీసీ డిపో మేనేజర్లు […]

Continue Reading

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ ప్రకటన

9 Viewsఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నేడు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు […]

Continue Reading

వ్యవసాయ మౌలికానికి ₹లక్ష కోట్లు

10 Viewsదిల్లీ: వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అలాగే మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా మత్స్య సంపద యోజన తీసుకొస్తున్నామని తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం మూడో విడత ప్యాకేజీలో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలైన మత్స్య, డెయిరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ప్యాకేజీ ప్రకటించారు. 11 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలు […]

Continue Reading

జగిత్యాలలో మరో మూడు కరోనా కేసులు

9 Viewsజగిత్యాల: జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. మల్యాల మండలం తాటి పెళ్లి గ్రామానికి చెందిన ఇద్దరికి, గొల్లపల్లి మండలం బొంకూరు కు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని డీఎంహెచ్ వో తెలిపారు. వీరిని ఐసోలేషన్ లో ఉంచామని త్వరలోనే గాంధీ దవాఖానకు తరలిస్తామన్నారు.

Continue Reading

సీఎం జగన్ మరో కీలక ప్రకటన.

10 Viewsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 2021 చివరికల్లా ప్రతీ గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను సులభతరం చేసేందుకు.. రైతుల కష్టాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి సీఎం […]

Continue Reading

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు

10 Viewsఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు మరింతగా సడలిస్తే దేవాలయాల్లో భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఈ రకమైన కసరత్తు మొదలుపెట్టగా… తాజాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి సైతం ఇదే రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనానికి వెళ్లాలి.

Continue Reading

జీడిమెట్లలో దారుణం.. భార్య ఇంటికి రావడం లేదని..

10 Viewsహైదరాబాద్ జీడిమెట్లలోని సుదర్శనరెడ్డి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్య తనను విడిచి వెళ్లిపోయిందనే కారణంతో ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకెళితే.. జీడిమెట్ల పీఎస్ పరిధిలో చింతల్, సుదర్శనరెడ్డి నగర్‌లో భువన్ సూర్య(30), అతడి భార్య, కూతురితో కలిసి ఓ భవనంలో ఆద్దెకు నివాసం ఉంటున్నాడు. భువన్ సూర్య నగరంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నాడు. భార్య వారు అద్దెకుండే భవనంలోనే బ్యూటీ […]

Continue Reading

మాచవరం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు

9 Viewsప్రకాశం: ఒంగోలు జీజీహెచ్‌లో నాగులుప్పలపాడు మండలం మాచవరం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు.పేద కుటుంబాల్లో జరిగిన ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు.

Continue Reading