జులై – ఆగస్టు మాసాల్లోనే కరోనాకు వ్యాక్సిన్! : సీఎం కేసీఆర్

11 Viewsహైదరాబాద్ : ఈ ఏడాది జులై – ఆగస్టు మాసాల్లోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం […]

Continue Reading

వలస కూలీలను అనుమతించాలి : సీఎం కేసీఆర్

13 Viewsహైదరాబాద్ : వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మనది సెంటిమెంటు కలిగిన దేశం. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను వదిలి వచ్చారు. సొంత వాళ్లను చూసుకోవాలని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని […]

Continue Reading

ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ప్రశంసలు

12 Viewsప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ మాట్లాడుతూ వలస కూలీల కోసం శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పాజిటివ్, యాక్టివ్‌ కేసులు లేని జిల్లాల్ని ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా మార్చాలని కేసీఆర్‌ కోరారు. అంతేకాదు రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని మోదీకి కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం […]

Continue Reading

తెలంగాణలో కరోనా విజృంభణ…

15 Viewsహైదరాబాద్: తెలంగాణలో వరుసగా మూడో రోజు కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలతో అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం సోమవారం మధ్యాహ్న సమయానికి రాష్ట్రంలో కొత్తగా మరో 69 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కాగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి పరిధిలో 63 కేసులు నమోదు […]

Continue Reading

గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం – గ్రామాల్లో నిద్రించాలంటూ

16 Viewsవిశాఖ జిల్లా పాతపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మృతుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రూ.30 కోట్లను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఈ సాయాన్ని జిల్లా యంత్రాంగం పంపిణీ చేస్తోంది. ఇందులోభాగంగా, సోమవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లతో పాటు… విశాఖ ఎంపీ […]

Continue Reading

హుండీ ఆదాయానికి గండికొట్టిన కరోనా

13 Viewsతిరుమల శ్రీవారి సిబ్బందికి వేతన కష్టాలు తప్పలేదు. శ్రీవారి హుండీ ఆదాయానికి కరోనా వైరస్ గండి కొట్టింది. దీంతో ఈ లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించ విషయంపై తితిదే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోన అత్యంత సంపన్న ఆలయం ఏది అంటే ఠక్కున చెప్పే పేరు శ్రీవారి పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి భక్తుల కానుకల ద్వారానే నెలకు రూ.200 నుంచి రూ.250 కోట్ల మేరకు వసూలవుతుంటాయి. అయితే, కరోనా వైరస్ కారణంగా గత 50 […]

Continue Reading

వెయ్యి మంది ప్రాణాలు కాపాడిన ఐపీఎస్… సీఎం జగన్ బంపర్ ఆఫర్

12 Viewsవిశాఖపట్టణం జిల్లా శివారు ప్రాంతమైన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఇటీవల విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా, ఈ విషవాయువు ఐదు గ్రామాలకు వ్యాపించింది. దీంతో ఈ గ్రామాల ప్రజలందరినీ ఖాళీ చేయించారు. అయితే, ఈ దుర్ఘటన వేకువజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం జోన్-2 డీసీపీ బిల్లా ఉదయ్ భాస్కర్ […]

Continue Reading

కరోనా కాలంలో మద్యం షాపులా? మూసేయాలని పిటీషన్

14 Viewsఏపీలో మద్యం షాపుల వ్యవహారం తాజాగా హైకోర్ట్‌కి చేరింది. మద్యం విక్రయాలు తక్షణమే నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఆంధ్రలో మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు పలువురు పిటీషన్‌ను దాఖలు చేయడంతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఇలా మద్యం దుకాణాలు తెరిస్తే అది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది బీఎస్ఎన్‌వీ ప్రసాద్ […]

Continue Reading

స్థానిక ఎన్నికలు వాయిదా.. లాక్డౌన్ పొడగించాలని కోరిన సీఎం జగన్!!

13 Viewsకరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ వాయిదా వేశారు. అలాగే, ఎన్నికల ప్రచారాన్ని కూడా వాయిదావేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి తగ్గింది. ఇదిలావుంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటారు.   ఇందులోభాగంగా, ప్రధాని మోడీ సోమవారం వీడియో […]

Continue Reading

రైల్వే శాఖ ప్రకటించిన తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాల

15 Viewsన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని నిర్ణయించిన కేంద్ర రైల్వే శాఖ అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ప్రయాణ సదుపాయం ఉంటుందని రైల్వే శాఖ మరోమారు స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే శాఖ ప్రకటించిన తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రెండు రైళ్లు మాత్రమే స్టాప్స్‌లో ఆగుతాయి. […]

Continue Reading