తమిళనాడులో 669 కరోనా కేసులు

14 Viewsఛండీగఢ్: పంజాబ్‌లో ఆదివారంనాడు కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,823కు చేరినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 1,626 యాక్టివ్ కేసులు ఉండగా, మృతుల సంఖ్య 31కి చేరింది. కాగా, దేశంలో మొత్తం 62,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 41,472గా ఉంది. 19,357 మందికి పూర్తి స్వస్థత చేకూరడంతో డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 2,109కి చేరినట్టు కేంద్ర […]

Continue Reading

వర్షాకాలపు వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే పోరాడాలి: కేటీఆర్

13 Viewsసీజనల్ వ్యాధుల నివారణ కోసం తెలంగాణ పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌. ఇందులో భాగంగా తన ఇంట్లో ఉన్న పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు. ప్రగతి భవన్‌ ప్రాంగణంలో కలియ తిరిగిన మంత్రి కేటీఆర్.. దోమల నివారణ కోసం యాంటీ లార్వా మందును చల్లారు. రానున్న వర్షాకాలం నాటికి దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా […]

Continue Reading

సామాజిక ఉద్యమంగా ప్రతి ఆదివారం-పది నిమిషాల కార్యక్రమం

12 Viewsహైదరాబాద్‌: సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల ఆవాసంలోని తన నివాసంలోని పూల కుండీలలో చెత్తను, నిల్వ నీటిని తొలగించి, తాజా నీటితో నింపారు. ప్రతి ఆదివారం-పది గంటలకు-పది నిమిషాలు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.

Continue Reading

40 ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను తరలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

13 Viewsవలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 13 రైళ్ల ద్వారా వలస కార్మికులను వారి రాష్ట్రలకు తరలించారు. కార్మికుల తరలింపు కోసం తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 4 కోట్ల రూపాయలు చెల్లించిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Continue Reading

రేపటినుంచి పనిచేయనున్న ప్రభుత్వ కార్యాయాలు

12 Viewsహైదరాబాద్ : లాక్ డౌన్ సడలింపులు వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ప్రైవేటు రంగానికి ఇచ్చిన మినహాయింపుల మేరకు ఇప్పటికే షాపులు తెరచుకున్నాయి. ఇదే క్రమంలో… ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ జోన్లలోని ఆఫీసర్లు, స్టాఫ్​ అందరూ సోమవారం నుంచి డ్యూటీకి హాజరుకావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి సేవలను అందుబాటులోకి తేవాలని సూచించింది.

Continue Reading

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదలీ

13 ViewsAmaravati: ఏపీ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో బదలీలు జరిగాయి. జిల్లాల్లో ముగ్గురు జాయింట్ కలెక్టర్లలో ఇద్దరు ఐ ఏ ఎస్ అధికారులు ఉండగా, ఒకరు రాష్ట్ర సర్వీసులకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పై ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ముగ్గురు జాయింట్ కలెక్టర్ల కు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ గతంలో నే ప్రభుత్వం […]

Continue Reading

నిపుణుల సూచనల మేరకే గ్రామాల్లోకి అనుమతి

13 Viewsవిశాఖ : ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద స్టెరైన్ లీకేజీ జీరో శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన నిపుణులు ఎల్జీ పాలిమర్స్‌ వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.భద్రతాపరంగా ఇక ఇబ్బంది ఉండదని నిపుణులు స్పష్టం చేశారని కలెక్టర్‌ పేర్కొన్నారు. నిరంతరాయంగా […]

Continue Reading

కర్నూలులో కేంద్ర బృందం పర్యటన

12 Viewsకర్నూలులో కరోనా కేసులపై కేంద్ర బృందం దృష్టి సారించింది. కర్నూలు వచ్చిన టీమ్.. జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయింది. జిల్లాలో వైరస్‌ కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కలెక్టర్ వీరపాండ్యన్. వారికి కేంద్ర బృందం పలు సూచనలు చేసింది. కర్నూలులో కరోనా ఎంత వేగంగా విస్తరించిందో.. అంతే వేగంగా నియంత్రించాలని స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా.. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కేంద్ర బృందం […]

Continue Reading

2లక్షలు దాటిన కరోనా కేసులు

11 Viewsమాస్కో: ప్రాణాంతక కరోనా వైరస్‌ బీభత్సం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రష్యా లో 11,012కు పైగా కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,09,668కు చేరుకుంది. కాగా, గత 24 గంటల్లో 88మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందగా.. మరణాల సంఖ్య 1,915కు చేరుకుంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలలో ఫ్రెంచ్‌, జర్మనీలను వెనక్కినెట్టి రష్యా ఐదో స్థానానికి చేరుకుంది.

Continue Reading

కంపెనీకి ఉన్న అనుమతులపై విచారణ జరుగుతోంది: మంత్రి అవంతి

12 Viewsఎల్జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో ప్రజలు ఉండడానికి అనువుగా ఉందో లేదో కమిటీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. పరిశ్రమలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. కంపెనీకి అనుమతులు ఉన్నాయా లేదా అన్నదానిపై విచారణ జరుగుతుందన్నారు అవంతి. మరోవైపు జన జీవనానికి ఇబ్బందులు కలగకుండా కమిటీలు సలహాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు కంపెనీ జీఎం మోహన్‌రావు. ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్‌ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

Continue Reading