చంద్రబాబు నక్కజిత్తులను మోదీ నమ్మరు..

11 Viewsఅమరావతి: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన దురదృష్టకరమని మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. హెల్త్‌ కార్డులు జారీ చేసి వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మృతుల కుటుంబాలకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి వైద్యసేవలు అందించడంతో పాటు 10 లక్షల ఆర్థికసాయం, చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష […]

Continue Reading

రాజమండ్రి ప్రజలకు గుడ్ న్యూస్.. మెడికల్ కాలేజీకి రంగం సిద్దం

11 Viewsతూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. శనివారం మీడయాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాజా .. రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు మొదటి దశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి 50 ఎకరాల స్థలం అవసరం అవుతుందని తెలిపారు. రాజమండ్రిలో ప్రజంట్ ఉన్న గవర్నమెంట్ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల […]

Continue Reading

విశాఖ ఘటనలో బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు

12 Viewsవిశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని టీడీపీ నాయకులు పరామర్శించారు. కేజీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లిన టీడీపీ నేతలు.. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిహారం విషయంలో సీఎం చెబుతున్న మాటలు అనుమానాన్ని కలిగిస్తున్నాయని.. వెంటనే ఈ ప్రమాదకర పరిశ్రమను ఇక్కడి నుంచి తొలగిస్తామని సీఎం ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Continue Reading

కరోనా పరీక్షల్లో ఎపి మొదటి స్థానంలో ఉంది : సిఎం జగన్‌

12 Viewsఅమరావతి : కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరణ తీరు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌ జనాభాకు 3,091 పరీక్షలు […]

Continue Reading

మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలని డిమాండ్‌

11 Viewsహైదరాబాద్ : నగరలోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దళిత బాలిక మహాలక్ష్మిపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌ను కఠిన శిక్షించాలని ఆల్‌ ఇండియా దళిత హక్కుల ఫోరం (ఏఐడీఆర్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన షకీల్‌ను తక్షణమే ఎన్‌కౌంటర్‌ చేయాలని అన్నారు. దళిత బాలికపై అత్యాచారాన్నితీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. గతంలో దిశపై అత్యాచారం చేసిన వాళ్ళను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని, మరి దళిత బాలికకు అన్యాయం చేసిన […]

Continue Reading

ప్రియుడిని అంతం చేసిన తండ్రి, సోదరుడు..

12 Viewsతన చెల్లిని ప్రేమించాడనే కోపంతో ఓ వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కోడికత్తితో పొడిచి చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన నల్లగొండ్ల దినేశ్(21), గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం చాలాకాలంగానే కొనసాగుతోంది. అయితే ఈ విషయం అమ్మాయి ఇంటిలో తెలియడంతో తండ్రి, సోదరుడితో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూతురి ప్రేమకు […]

Continue Reading

పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు

15 Viewsహైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు వేగం చేసింది. మార్చిలో జారీ చేసిన హాల్‌టికెట్లతోనే ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి జిల్లా విద్యాధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాలను పెంచిప్పటికీ పాత కేంద్రాల సమీపంలోనే కొత్త కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Continue Reading

మరో మూడు రోజులు వర్షసూచన

11 Viewsహైదరాబాద్‌ : ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వాయవ్య మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక వరకు ఇంటీరియర్‌ మహారాష్ట్ర, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి.. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని […]

Continue Reading

దివ్యాంగుడి మనసు గొప్ప.. పింఛన్ డబ్బులతో కోతులకు ఆహారం

12 Viewsపెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖనిలోని ఎండీహెచ్‌డబ్ల్యూఎస్‌ అనాథ పిల్లల సంరక్షణ కేంద్రం నిర్వాహకుడు, దివ్యాంగుడు పోచంపల్లి రాజయ్య మూగజీవాల ఆకలి తీరుస్తున్నాడు. తనకు వచ్చే పింఛన్‌ డబ్బులకు ప్రభుత్వం ఇచ్చిన కరోనా సాయం రూ.3 వేలను వెచ్చించి ఆకలితో అలమటిస్తున్న కోతులకు అన్నం, పండ్లు పెడుతున్నాడు. గత కొన్ని రోజులుగా 30 కిలోమీటర్ల దూరంలోని మంథని-కాటారం మార్గమధ్యలో అటవీ ప్రాంతానికి బైక్‌పై వెళ్లి వానరాలకు ఆహారం అందిస్తున్నాడు. మూగజీవాల ఆకలి తీర్చడం తృప్తిగా ఉందని చెబుతున్న […]

Continue Reading

తెలంగాణ రైతు రుణమాఫీ..రూ. 1200 కోట్లు విడుదల

11 Viewsరైతు రుణమాఫీ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హమీ అమలుకు చర్యలు చేపట్టింది. తొలివిడత 25వేల రూపాయలలోపు రుణం ఉన్న వారికి రుణం మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 1200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక వానాకాలం పంటలకు రైతుబంధు నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ప్రజలకు హామీనిచ్చింది. ఈ హామీ అమలు […]

Continue Reading