బ్రాహ్మణపల్లిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన సీతక్క

18 Viewsములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని రోజువారి కూలీలుగా జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు గంట రామారావు, బొడం పూడి రాఘవరావు, దూదిపాల బాలకృష్ణ, ఆజాద్ సహకారంతో శుక్రవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క బియ్యం,కూరగాయాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి,మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,మాజీ జడ్పీటీసీ గుమ్మడి సోమయ్య,మాజీ పిఎసిఎస్ చైర్మన్ వాళ్ళేపల్లి శివయ్య, కొమురం ధనలక్ష్మి,తీగల మల్లారెడ్డి,తూడి భగవాన్ రెడ్డి,కొంకతి […]

Continue Reading

జనసేనలోకి చిరు.. తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు..!

18 Viewsకెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి రాజకీయల్లోకి వచ్చి పి ఆర్ పి పెట్టారు. ఎంతో ఆశిస్తే.. అనుకున్న స్థాయిలో పిఆర్‍పి నిలవలేకపోయింది. దాంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో కలిపివేసి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ అప్పట్లో అన్న చిరు పైనే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటున్నారు. […]

Continue Reading

చంద్రబాబు ఆలోచనల్ని మెచ్చిన నీతి ఆయోగ్ చైర్మన్ ..!

20 Viewsదేశంలో కరనా వైరస్ ప్రభావం, కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థిక వ్యవస్థను మళ్లీ పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ.. కొన్ని సలహాలతో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల కిందట ప్రధానికి ఓ లేఖ రాశారు. దాన్ని ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ కు కూడా పంపించారు. ఈ లేఖను చూసిన తర్వాత ఆప్పుడే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు.. నీతి ఆయోగ్ చైర్మన్ నుంచి […]

Continue Reading

భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోండి: బండి సంజయ్

15 Viewsకరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనునిత్యం అన్ని రంగాల్లో తమ శ్రమను దారపోస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ తీర్మానం ప్రకారం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికి 1500 రూపాయలను అందించాలి. కార్మికుల సహాయ నిధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రం అదుకోకపోవడం దురదృష్టకరం. మే డే సందర్భంగానైనా సీఎం కేసీఆర్ […]

Continue Reading

బీజేపీ నేత కన్నాకు సవాల్ విసిరిన బుగ్గన

13 Viewsకరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపణలపై శుక్రవారం ఆయన స్పందించారు. తాను సదరు కంపెనీలో డైరెక్టర్‌ను అని నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ […]

Continue Reading

ఏపీ, మహారాష్ట్ర ప్రయాణాలపై టీఎస్ ప్రభుత్వం నిషేధం

17 Viewsదేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ అత్యధిక కోవిడ్-19 కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, మహారాష్ట్రకు తెలంగాణ వాసులెవరూ వెళ్లొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది. ఏపీ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాసులకు ఆ రాష్ట్రాలతో బంధుత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సరిహద్దుల్లో ఉన్నవారు వైద్య, ఇతర […]

Continue Reading

తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదు

18 Viewsహైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ కరోనా నుంచి కోలుకొని 24 మంది బాధితులు డిశ్చార్జి కాగా.. మొత్తం 464 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,044కి చేరగా.. మరో 552 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈటల మీడియాతో […]

Continue Reading

లాక్ డౌన్ మరో 2 వారాలు పొడిగింపు

14 Viewsన్యూఢిల్లీ : భరత్ లో కరోనా పాజిటివ్ కేసుకు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో 2 వారాల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో, లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు అలాగే కొనసాగనున్నాయి. ఆరంజ్, గ్రీన్ […]

Continue Reading

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

13 Viewsఅమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గనులు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్‌ను బదిలీ చేశారు. జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని రాంగోపాల్‌కు ఆదేశించారు. అలాగే పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేదికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీగా శ్రీధర్‌, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి మహమూద్‌ను నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Continue Reading

కన్న కూతురి గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి..!

18 Viewsసంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుల్కల్‌ మండలం గొంగులూరు తండాలో కన్న కూతురి గొంతుకోసి దారుణంగా చంపేశాడు ఓ కసాయి తండ్రి. రమావత్‌ జీవన్‌ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా మనస్థాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న నాలుగు సంవత్సరాల చిన్నారి అవంతిక గొంతు కోసి హతమార్చాడు.

Continue Reading