కల్తీ సారా తాగి వ్యక్తి మృతి

29 Viewsచెన్నై: తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు సమీపం నాయకనేరి కొండ ప్రాంతంలో కొందరు కల్తీ సారాను విక్రయిస్తున్నారు. సీకియపొన్నెకు చెందిన కూలీ వెంక టేషన్‌ (30) శుక్రవారం ఆ ప్రాంతంలోని సారా తాగిన వెంటనే మైకంతో కింద పడిపోయాడు. ఆయనను వెంటనే సమీపంలోని వారు ఆంబూరు ప్రభుత్వా సుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై ఆంబూరు తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. కల్తీ సారా తాగడంతోనే ఆయన మృతిచెందినట్టు పోలీసుల […]

Continue Reading

రేషన్ కార్డుల్లేని వారికి సీఎం శుభవార్త

32 Viewsన్యూఢిల్లీ : రేషన్ కార్డుల్లేని వారికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుభవార్త వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ఢిల్లీలో రేషన్ కార్డు లేని వారికి కూడా చౌకధరల దుకాణాల ద్వార ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో 71 లక్షలమంది రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఏడున్నర కిలోల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేశామని సీఎం చెప్పారు. ఢిల్లీలో చాలామంది ప్రజలకు రేషన్ కార్డులు లేవని, మరో 6.5లక్షల […]

Continue Reading

బాక్సాఫీస్ వద్ద బన్నీ తారక్‌ల మధ్య ఫైట్‌..తప్పదా..

32 Viewsబాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్‌, బన్నీల మధ్య పోటీ తప్పేలా లేదు. ఈ ఇద్దరు యంగ్ హీరోలతో టాలీవుడ్కు చెందిన ఇద్దరు అగ్ర దర్శకులైన సుకుమార్‌, త్రివిక్రమ్ సినిమాలను తెరకెక్కిస్తుండటం విశేషం. సుకుమార్ ముచ్చటగా మూడోసారి బన్నీతో కలసి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుండగా ఇటీవల కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ఇక తారక్ తన 30 సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని ప్రకటించారు. […]

Continue Reading

నాని వి సినిమాలో హీరోయిన్ పాత్ర అదే..

26 Viewsనాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “వి”. గ్యాంగ్ లీడర్ వంటి ఓ మోస్తారు విజయం తర్వాత నాని చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. పూర్తి కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో నాని నటిస్తున్న మొదటి సినిమాగా చెప్పవచ్చు. ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్న మూడవ చిత్రం ఇది. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో నటించిన అష్టా చమ్మా, జెంటిల్ మేన్ చిత్రాలకి మంచి ఫలితమే […]

Continue Reading

హిజ్రాలకు ఉచితంగా కిరాణా సరుకులు

33 Viewsకరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి గాను ఆదివారం నుంచి రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల పనిగంటలను తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఆ మేరకు మందుల దుకాణాలు, కిరాణా సరకులు దుకాణాలు, హోటళ్లు (పార్శిల్స్‌ విక్రయం) ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే తెరచి ఉంచాలని ఆయన ఆదేశించారు. గత వారం రోజులకు పైగా 144 నిషేధాజ్ఞలు అమలు చేస్తుండటంతో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలను ఉదయం ఆరు […]

Continue Reading

బుల్లితెర: ఆగిపోనున్న జబర్దస్త్..!?

34 Viewsజబర్దస్త్ ఆగిపోతుంది అంటే ఎవరైనా సరే.. ఎందుకు ఆగిపోతుంది? కారణం ఏంటి అని అనుకుంటారు.. కానీ కరోనా వైరస్ దెబ్బ పడితే ఎవరైనా సరే ఆగిపోవాల్సిందే.. ఇంటికే పరిమితం కావాల్సిందే.. అలానే ఇప్పటికే టీవీలలో వచ్చే అన్ని సీరియల్స్ ఆగిపోయాయి.. ఇంకా బ్యాక్ అప్ ఉన్న టీవీ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు వస్తున్నాయ్.. ఇప్పుడు అవి కూడా త్వరలో ఆగిపోనున్నాయి అంట.. ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండీ.. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందుకు సినిమా షూటింగ్ లు, సీరియల్ […]

Continue Reading

పిల్లర్‌ని ఢీకొన్న హీరోయిన్ కారు.. తప్పిన ప్రమాదం

31 Viewsలాక్‌డౌన్ సమయంలోను కొందరు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ అత్యవర సేవలు కొనసాగిస్తున్న పోలీసులకి ఇబ్బందిగా మారుతున్నారు. రోడ్లపై రావొద్దని ఎంత చెప్పినప్పటికీ, వారి ప్రవర్తన మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిల మండ్రే లాక్‌డౌన్ నిబంధనలని ఉల్లంఘించి స్నేహితులతో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లిందట.బెంగళూరులోని వసంతనగర్ ఫ్లైఓవర్ కింద భాగంలోని పిల్లర్ ను ఆమె కారు ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయిందని తెలుస్తోంది. కారు ప్రమాదంలో నటి షర్మిల […]

Continue Reading

కరోనా బాధితులు కాదు..కరోనాయే మన శత్రువు

26 Viewsకరోనా వైరస్‌ మాత్రమే తమకు ప్రధాన శత్రువు అని, కరోనా బాధితులు, రోగులను శత్రువులుగా పరిగణించకూడదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ హితవు పలికారు. ఈ మేరకు శనివారం తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన జారీ చేశారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకోవడం తన ఆనవాయితీ అని, అలాంటిది కరోనా మహమ్మారి తననే కాకుండా ప్రజలందరినీ ఇంటిపట్టునే గడిపే పరిస్థితి తీసుకువచ్చిందని అన్నారు. కరోనా వైరస్‌ సోకిన లక్షణాలతో ప్రత్యేక వార్డులలో […]

Continue Reading

పవన్ కళ్యాణ్ తీరుపై జన సైనికులలో అసహనం ?

30 Viewsగత ఎన్నికలలో పవన్ ‘జనసేన’ కు సుమారు 7 శాతం ఓట్లు పడ్డాయి అంటే కనీసం ఆ స్థాయిలో ఓట్లు వేయించడానికి పవన్ అభిమానులు జనసైనికులు ఎంతో కష్టపడ్డారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పవన్ ఎమ్ఎల్ఎ గా కూడ ఓడిపోవడంతో తన అభిమానులు పూర్తిగా తన విజయం కోసం కష్టపడలేదు అన్న అభిప్రాయాన్ని పవన్ తన కామెంట్స్ రూపంలో అనేకసార్లు తెలియ చేసాడు. దీనితో ధైర్యం చెప్పవలసిన జనసేనాని తమ ఉత్సాహం పై […]

Continue Reading

8న అన్ని పార్టీల సభాపక్ష నేతలతో మోదీ భేటీ

26 Viewsన్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని అన్ని పార్టీల సభాపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ తదితర అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో కలిపి ఐదుగురికిపైగా సభ్యులున్న పార్టీల సభాపక్ష నేతలతో మోదీ మాట్లాడుతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. ఏప్రిల్‌ 8వ తేదీన ఉదయం […]

Continue Reading