చంద్రబాబు పీఏ పై కేసు నమోదు

19 Views  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఏ పి. మనోహర్ పై కేసు నమోదైంది. వైసీపీ నేత విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోహర్ పై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుప్పంలోని కోపరేటివ్ టౌన్ బ్యాంకులో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం ఫిక్సిడ్ డిపాజిట్లకు సంబంధించి తన సంతకాలను ఫోర్జరీ చేసి మనోహర్ రుణం తీసుకున్నారని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్ చేసిన ఫిర్యాదులో […]

Continue Reading

అమెరికాలో భార్య హత్య, భర్త ఆత్మహత్య!

17 Viewsన్యూజెర్సీ: అమెరికాలోని జెర్సీ నగరంలో భారత సంతతి గర్భిణీ సహా ఆమె భర్త శవమై తేలిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గరీమా కొఠారి(35), మన్‌మోహన్ మాల్‌(37) భార్యాభర్తలు. ప్రస్తుతం గరీమా ఐదు నెలల గర్భవతి. కాగా ఏప్రిల్ 26న ఉదయం వీరిద్దరూ విగత జీవులుగా కనిపించారు. కొఠారిని ఇంట్లో దారుణంగా హత్య చేయగా, మోహన్ మాల్ హడ్సన్ నదిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై […]

Continue Reading

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల మృతి

19 Viewsకర్ణాటకలోని రాయచూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఇద్దరు తెలంగాణ వాసులు మృతిచెందారు. పూర్తివివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా బెంగళూరు నుంచి గురువారం ఉదయం కారులో సొంత గ్రామానికి బయలుదేరారు. రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలోకి రాగానే వీరి కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపాల్ అక్కడికక్కడే […]

Continue Reading

లాటరీ పేరుతో ఘరానా మోసం

21 Viewsప్రకాశం: జిల్లాలోని జరుగుమల్లి మండలం పీఠాపురంలో లాటరీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. రూ.10 కోట్ల లాటరీ వచ్చిదంటూ ట్యాక్స్‌ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ. 46 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్టు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Continue Reading

రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నాం..

23 Viewsఅమరావతి: కష్టకాలంలో సైతం రైతుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రమిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకు గుండె తరుక్కుపోతుందో అర్థం కావడంలేదని.. బహుశా సీఎం వైఎస్‌ జగన్‌ రైతులను ఆదుకోవడానికి స్పందిస్తున్న తీరు చూసి గుండె తరుక్కుపోతుందేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. టమోటా పంటలు కొనుగోలు చేస్తున్నందుకు ఆయన బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం సీఎం జగన్‌ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నీ హయాంలో […]

Continue Reading

దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా కేసులు

21 Viewsన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. దేశంలో కరోనా రికవరీ రేటు 25 శాతం పైగానే ఉందన్నారు. కరోనా నుంచి […]

Continue Reading

జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

19 Viewsఅమరావతి: సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రేషన్ పంపిణీ సమయంలో ప్రజలు బొటనవేలు ముద్రలు వేయాలనే విధానం సరిగాలేదని తప్పుబట్టారు. ప్రజలు, డీలర్లు ఈ తరహా విధానం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కొంతకాలం బొటనవేలు ముద్రలు తీసుకునే పద్ధతిని మాఫీ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

Continue Reading

వనస్థలిపురంలో కరోనా మృతి కలకలం

21 Viewsహైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్‌ లింకులతో సంబంధం లేనివారు.. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారులు కూడా కరోనా వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వనస్థలిపురం ఏ-క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో అధికారులు కరోనా వచ్చిన ఇంటి పరసరాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించి ఆ ప్రాంతంలో ఎవరూ సంచరించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయించారు. […]

Continue Reading

దిగుబడిని చూసి వారు ఓర్వలేకపోతున్నారు

20 Viewsకరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని పౌరసరఫరాల మంత్ర గంగుల కమాలాకర్ మండిపడ్డారు. కొత్తపల్లిలో మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఏనాడు పంట రాలేదని, కొనుగోళ్లు కూడా గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్ వల్లే పంట దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. 21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సగటున రోజుకు లక్ష […]

Continue Reading

అందుకే గుంటూరుకు రాలేకపోయా: ఎంపీ గల్లా జయదేవ్

18 Viewsగుంటూరు: పార్లమెంటు సమావేశాల సమయంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. హైదరాబాద్‌లో స్వీయ నిర్బంధంతో ఉండటం వలన గుంటూరుకు రాలేకపోయానన్నారు. కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నవారికి అభినందనలు తెలిపారు. వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. కరోనాపై గుంటూరు కలెక్టర్‌తో ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడానన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 199 కేసులున్నాయని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో జాగ్రత్తలతోపాటు నిత్యావసరాల పంపిణీ చేయాలని […]

Continue Reading