మన దేశ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అబ్దుల్ మునాఫ్

50 Viewsమన దేశ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది ప్రజలు పోలీసులకు సహకరించాలి కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవలసిన బాధ్యత అందరిపైనా ఉంది ఏ ఐ ఎం ఐ ఎం నాయకులు  అబ్దుల్ మునాఫ్ కర్నూలు ,మార్చి 26 , ( సీమ కిరణం న్యూస్ ) :  ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవలసిన బాధ్యత అందరిపైనా ఉందని  ఏ ఐ ఎం ఐ ఎం  నాయకులు  అబ్దుల్ మునాఫ్ తెలిపారు. ఈ సందర్భంగా  గురువారం ఆయన […]

Continue Reading

సినీ కార్మికులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రోజా

5 Viewsకరోనా ప్రభావంతో ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏరోజు ఆ రోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది పరిస్థితి దయనీయంగా తయారైంది. అయితే ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సినీనటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. పేదకళాకారుల ఆకలి తీర్చేందుకు 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాదు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయపడేందుకు త్వరలో […]

Continue Reading

తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ కోటి విరాళం

4 Viewsహైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో అనేక వ్యవస్థలు స్థంభించిపోయాయి. ప్రభుత్వాలు మాత్రం నిర్విరామంగా కరోనా వ్యతిరేక పోరు సాగిస్తున్నాయి. సెలబ్రిటీలు తమవంతుగా ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎపి సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ ఫండ్ లకు విరాళం ఇస్తున్నట్టు […]

Continue Reading

కామారెడ్డిలో విషాదం.. గేదెలు మేపేందుకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి

5 Viewsకామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. గేదెలు మేపేందుకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియల్ గ్రామంలో చోటుచేసుకుంది. చేతికందివచ్చిన కొడుకులు చెరువులో పడి మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండాపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మద్దికుంట శేఖర్, రణదీప్‌లు రోజులాగే గేదెలను మేపేందుకు వెళ్లారు. మేత తిన్న తర్వాత గేదెలు నీరు తాగేందుకు చెరువులోకి దిగాయి. నీటిలో నుంచి గేదెలు ఎంతసేపటికి బయటకు […]

Continue Reading

లేడీస్ హాస్టల్ గదిలో రహస్య కెమెరాలు…వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్…

5 Viewsఆ హాస్టల్ లో అంతా అమ్మాయిలే వారిలో కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులే ఎక్కువ అలాంటి హాస్టల్ గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి వారు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు ఇంటర్నెట్ లో లీక్ చేసిన ఘటన బంగ్లాదేశ్ లో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే ఢాకాలోని ఓ లేడీస్ హాస్టల్ లో యువతులు నివాసముంటున్నారు. వీరంతా రకరకాల జాబ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో హాస్టల్ లో నివాసం ఉంటున్న షహీన్ (పేరు మార్పు) తన గదిలో దుస్తులు […]

Continue Reading

ఏ ప్రాంతం వాళ్లు అక్కడే ఉండండిః సిఎం జగన్‌

4 Viewsతాడేపల్లి : కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో ఉన్న జనం అక్కడే ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే సమస్య పెద్దది అయ్యే ప్రమాదంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 14 వరకూ ఎక్కడికి కదలకుండా ఉండాలని కోరారు. నిన్న జరిగిన ఘటనలు తనను ఆవేదన వ్యక్తం చేశాలా ఉన్నాయన్నారు. ఏపీ బోర్డర్‌లో మన వాళ్లు నిలిచిపోవడం ఇబ్బందికరంగానే […]

Continue Reading

కారులో శవమై కనిపించిన చిన్నారి

5 Viewsఒడిశా, జయపురం: గత కొద్ది రోజులుగా ఆచూకీ కనిపించని ఓ మైనర్‌ బాలిక.. పాడుబడిన కారులో శవమై కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. బాలిక గొంతు వద్ద కత్తి గాట్లు ఉండటంతో ఎవరో హత్య చేసి, కారులో పడవేశారని అనుమానం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే… కొరాపుట్‌ జిల్లా లమతాపుట్‌ సమితి కొంజన గ్రామం సమీపంలో కారులో ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. మాచ్‌ఖండ్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కొరాపుట్‌ నుంచి డాగ్‌ […]

Continue Reading

వికారాబాద్‌లో విషాదం.. గ్రామ సర్పంచ్ ఆత్మహత్య

5 Viewsవికారాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఓ గ్రామ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ అపర్ణ. అపర్ణ బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో అపర్ణ చనిపోయింది. కాగా సర్పంచ్ అపర్ణ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయాలు తెలియాల్సి ఉంది. అపర్ణ మృతి చెందడం పట్ల […]

Continue Reading

ఇళ్ల మధ్య క్వారంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయొద్దు : గ్రామస్తులు

7 Viewsకృష్ణా : కృష్ణాజిల్లా కైకలూరు చైతన్య స్కూల్ లో ఏర్పాటు చేయుచున్న క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేయవద్దని అధికారులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులతో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తే కరోనా వ్యాధి గ్రామస్తులకు సోకే ప్రమాదం ఉందని భయపడుతూ అధికారులను అడ్డుకున్నారు. సిఐ వైవివిఎల్ నాయుడు ప్రజలతో మాట్లాడి సెంటరు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం శానిటైషన్ చేస్తామని ప్రజలకు వివరించారు.

Continue Reading

కరోనాపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

7 Viewsతూర్పుగోదావరి : గండేపల్లి మండలంలోని మండల్ పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల అధికారులు ఎంపీడీవో జాన్ లింకన్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు, ఈఓపిఆర్ డి మూర్తి, వ్యవసాయ అధికారి విశ్వనాథం పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వైరస్ పై 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీస్ అధికారులు అత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని నిలుపుదల చేయాలని సూచించారన్నారు. […]

Continue Reading