లాక్‌డౌన్‌.. 338 కేసులు !

8 Viewsకరోనా కట్టడిలో భాగంగా తెలుగు రాష్ఠ్రాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ ని పట్టించుకోకుండా ప్రజలు బయట తిరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించినందున ఏపీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేయడంతో పాటు 288 వాహనాలను సీజ్‌ చేసినట్లు మంత్రి నాని వివరించారు. లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 తర్వాత ఇవ్వాల్సిన రేషన్‌ను ఈ నెల […]

Continue Reading

చైనాలో మరో వైరస్ కలకలం.. ఒకరి మృతి

7 Viewsకరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో చైనాలో మరో వైరస్ బయటపడింది. ఈ వైరస్‌తో ఓ వ్యక్తి మృత్యువాతపడడంతో మళ్లీ కలకలం రేగుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో చైనాతోపాటు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 16500మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇందులో ఒక్కచైనాలోనే మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్‌ సోకింది. అయితే.. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాకు హంటావైరస్ రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. చైనాలోని షాంగ్డాండ్ […]

Continue Reading

తలైవా స్టైల్…అందుకే సూపర్ స్టార్ అయ్యాడు

8 Viewsసూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన స్టైల్‌కి పడిపోనివారు అంటూ ఉండరు. ఆయన టవల్ తీసినా, నోటిలో బబుల్ గమ్ వేసుకున్నా, చుట్టను విసిరి నోటితో పట్టుకున్నా, కళ్లకు అద్దాలు పెట్టకున్నా.. ప్రతి దానిలో రజినీకా మార్క్ స్టైల్ ఉంటుంది. అయితే, రజినీకాంత్ స్టైల్‌ను కాపీ కొట్టాలని చూశారు ప్రముఖ టీవీ ప్రెజెంటర్ బేర్ గ్రిల్స్. రజినీకాంత్ స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకుంటారు కదా.. బేర్ గ్రిల్స్ కూడా అలానే పెట్టుకోవాలని […]

Continue Reading

కరోనా కారణంగా నాగార్జున హిట్ సినిమా సీక్వెల్ వాయిదా

8 Viewsనాగార్జున కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆ పాత్ర పేరుతోనే ఒక సినిమా చేయాలని నాగార్జున భావించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తుండటంతో, ఏప్రిల్ 2వ వారంలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనుకున్నారు. అయితే […]

Continue Reading

కేసీఆర్‌కు రూ. 10 లక్షలు అందజేసిన నితిన్‌

9 Viewsప్రకటించినట్లుగానే కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళం అందజేశాడు హీరో నితిన్‌. మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిసిన ఆయన రూ. 10 లక్షల చెక్కును అందజేశాడు. ఈ సందర్భంగా నితిన్‌ను అభినందించిన కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. నితిన్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నిరోధ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా […]

Continue Reading

చిరంజీవి లూసిఫర్ చేయడం లేదా…?

6 Viewsరీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూకుడు గా సినిమాలు చేస్తున్నారు. జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యే దశలో ఉంది. అయితే కరోనా వైరస్ ఇప్పుడు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో చిరంజీవి తన సినిమా షూటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే అందరూ కూడా సినిమా షూటింగ్ లో ఉండవద్దు అని ఆయన అందరికి […]

Continue Reading

నాని కోసం ఈ దర్శకుడు ఇంత చేస్తున్నాడా?

11 Viewsఓ పక్క కరోనా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. దీని భారిన పడిన ఇటలీ విల విల లాడుతోంది. రోజూ కూడా ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీని దెబ్బకు అన్నీ లాకౌట్ అయిపోతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు రాష్ట్రాలన్నీ ఇప్పటికే లాకౌట్ ప్రకటించేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు జనతా కర్ఫ్యూని విధించారు. అయితే ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం వచ్చే నెల ఏప్రిల్ 14 వరకు ఈ కర్ఫ్యూ […]

Continue Reading

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ …కరోనాకూ కవరేజీ ఇచ్చే పాలసీ!

10 Viewsకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో ఆదివారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 324కు చేరింది. ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి గురించి భయపడుతున్నారు. ఇంతకీ మన ఇన్సూరెన్స్‌ పాలసీలు, ముఖ్యంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు కరోనా చికిత్సకు కవరేజీకి ఇస్తాయా లేదా అన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం. దీంతో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) ఈ విషయమై గతవారం సర్కులర్‌ […]

Continue Reading

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్… కారణం ఏమిటంటే…?

8 Viewsగత కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు మాత్రం స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో పాటు ఈరోజు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించవచ్చని వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక దశలో 1286 పాయింట్లు పుంజుకుంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజ్ ను ప్రకటించడానికి కొంతమేర […]

Continue Reading