హాకీలో అమ్మాయిలకు తొలి గెలుపు

12 Viewsఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన రాణి రాంపాల్‌ సేనకు మంగళవారం తొలి గెలుపు దక్కింది. ఫేవరేట్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడి భారత్‌ 1-0తో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. భారతజట్టు తరఫున ఏకైక గోల్‌ను కెప్టెన్‌ రాణి రాంపాల్‌ నాల్గో క్వార్టర్‌ 47వ నిమిషంలో చేసింది. భారత్‌కు రెండు క్వార్టర్‌లలో పెనాల్టీ కార్నర్‌లు లభించినా.. గోల్‌ చేయలేకపోవ డంతో ఇరుజట్లు 0-0తో సమంగా నిలిచాయి. అదే క్రమంలో మూడో క్వార్టర్‌లోనూ గోల్స్‌ నిరాశే […]

Continue Reading

తొలిరోజే 24 వికెట్లు

12 Viewsపాటియాల: ఆంధ్ర- పంజాబ్‌ జట్ల మధ్య మంగళవారం నుండి ప్రారంభమైన రంజీట్రోఫీ మ్యాచ్‌లో తొలిరోజే ఇరుజట్లు 24 వికెట్లను సమర్పించుకున్నాయి. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌ను ఆరంభించిన ఆంధ్ర జట్టు సిద్ధార్ధ్‌ కౌల్‌(5/24), చౌదరి(3/28), క్రిషన్‌(2/31) దెబ్బకు 39.4 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర జట్టులో సుమంత్‌ 22, శశికాంత్‌ 20 మాత్రమే రాణించారు. అనంతరం ఆంధ్ర బౌలర్లు షోయబ్‌(5/46), ఆశిష్‌(5/50) చెలరేగడంతో 35.2 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేయగల్గింది. అనంతరం రెండో […]

Continue Reading

పృథ్వీ షా వచ్చేశాడు!

11 Viewsహామిల్టన్‌: న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీ్‌సకు భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ముంబై కుర్రాడు పృథ్వీ షా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్‌ జట్టులోకి వచ్చాడు. గాయంతో సిరీస్‌ నుంచి వైదొలగిన రోహిత్‌ స్థానంలో పృథ్వీ ఎంపికయ్యాడు. టెస్ట్‌ సిరీస్‌ ఈనెల 21న వెల్లింగ్టన్‌లో మొదలవనుంది. 2018 అక్టోబరులో వెస్టిండీ్‌సతో మ్యాచ్‌లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన పృథ్వీ.. ఆ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కివీ్‌స-ఎతో సిరీ్‌సలో భాగంగా పృథ్వీ ప్రస్తుతం న్యూజిలాండ్‌లోనే […]

Continue Reading

పాకిస్థాన్‌పై 10 వికెట్లతో ఘన విజయం

14 Viewsసీనియర్లయినా, జూనియర్లయినా దాయాదిపై తమదే పైచేయి అని భారత క్రికెటర్లు నిరూపించారు. అండర్‌-19 వరల్డ్‌క్‌ప సెమీఫైనల్లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌లో అదరహో అనిపించి పాకిస్థాన్‌ను 10 వికెట్లతో చిత్తు చేశారు. తొలుత పేసర్లు, స్పిన్నర్లు మెరవడంతో ఓ మోస్తరు స్కోరుకే పాకిస్థాన్‌ను కట్టడి చేశారు. అనంతరం ఓపెనర్లు ముఖ్యంగా యశస్వీ జైస్వాల్‌ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించిన డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఫైనల్లో ప్రవేశించింది. వరుసగా మూడోసారి టైటిల్‌ ఫైట్‌కు చేరి చరిత్ర సృష్టించింది. […]

Continue Reading

నేడే న్యూజిలాండ్ ,ఇండియా మధ్య మొదటి వన్డే…

12 Viewsన్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆతిధ్య జట్టు తో 5టీ 20ల సిరీస్ లో తలపడ్డ భారత్ .. ఆ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది ఇక ఇప్పుడు వన్డే సిరీస్ పై కూడా కన్నేసింది. అందులో భాగంగా నేడు కివీస్ తో టీమిండియా మొదటి వన్డే లో తలపడనుంది. హామిల్టన్ లోని సెడన్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. […]

Continue Reading

కెన్యా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

17 Viewsనైరోబి : కెన్యా మాజీ అధ్యక్షుడు డేనియల్‌ అరప్‌ మోయి (95) మృతిచెందారు. నైరోబీలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తెల్లవారుజామున ఆయన మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అరప్‌ మోయి మృతిపట్ల అధ్యక్షుడు ఉహ్రూ కెన్యట్టా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరప్‌ మోయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కెన్యా ఓ గొప్ప మేథావిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. 1978 నుంచి 2002 వరకు కెన్యా అధ్యక్షుడిగా […]

Continue Reading

వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 90వ వార్షికోత్సవం

14 Viewsహనోయ్ : వియత్నాం కమ్యూనిస్టు పార్టీ (సిపివి) 90వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం నాడు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాజధాని హనోరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు ఎన్‌గుయెన్‌ ఫుట్రాంగ్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దేశం సాధించిన అనేక విజయాలకు… స్పష్టమైన దిశా నిర్దేశం చేయగలిగిన పార్టీ నాయకత్వమే కారణమన్నారు. గత 35 ఏళ్ల సంస్కరణ పథంలో ప్రయాణించిన వియత్నాం కాలం చెల్లిన సామాజిక, […]

Continue Reading

కరోనా కేసులు 20,522

10 Viewsబీజింగ్‌/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మరణించినవారి సంఖ్య 426కి చేరింది. సోమవారం ఒక్కరోజే చైనాలో 64 మంది చనిపోగా, 3235 కొత్త కేసులు, 5072 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో 492 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 1,71,329 మంది అనుమానితులు ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. చైనాలో ఈ వైరస్‌ బాధితుల సంఖ్య సోమవారం నాటికి 20,522కి చేరింది. వైరస్‌ వ్యాప్తి, […]

Continue Reading

షాహీన్బాగ్ నిరసనల్లో విషాదం

27 Viewsన్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసనల్లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల చంటి బిడ్డతో ఓ తల్లి నిరసనల్లో పాల్గొనగా.. తీవ్ర చలిగాలికి ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాద ఘటన అందరి కంట కన్నీరు పెట్టించింది. వివరాల్లోకెళ్తే.. షాహీన్‌బాగ్‌ వద్ద నిరసనల్లో పాల్గొంటున్న నజియా అనే మహిళ మహ్మద్‌ జహాన్‌ అనే తన నాలుగు నెలల కుమారుడిని ప్రతిరోజూ తనతోపాటు అక్కడికి తీసుకొచ్చేది. ఈ చిన్నారిని నిరసనకారులందరూ […]

Continue Reading

గాంధీజీని తూలనాడటం బాధాకరం

11 Viewsదేశం కోసం తన జీవితం అంకితం చేసిన గాంధీజీని ఇష్టారీతిన తులనాడటంపై పార్లమెంట్‌ ఉభయసభలు భగ్గుమన్నాయి. గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మంగళవారం లోక్‌సభలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. సభ ప్రారంభం కాగానే, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), డీఎంకే, టీంఎంసీ పార్టీల ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా కార్యకలాపాలను తక్షణమే రద్దు చేసి సీఏఏ ఆందోళనల్లో ప్రభుత్వం ఉద్దేశపూరితంగా హింసాత్మకం చేస్తున్న విషయం విదితమే. […]

Continue Reading