అమరావతిలో తీవ్ర ఉత్కంఠ.. నేతల గృహ నిర్బంధం.. భారీ బందోబస్త్..!!

74 Viewsఏపీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఈ రోజు జాతీయ రహదారులు దిగ్బంధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. అనుమతి లేదని నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తుగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కీలక నేతల ఇళ్లకు వెళ్లిని వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. హైవేల దిగ్బంధానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీ గల్లా […]

Continue Reading

బీజేపీలో చేరగానే మోత్కుపల్లి ఎంతమాట అనేశారు!

90 Viewsసీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా కాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన మోత్కుపల్లి పలు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి పార్టీని వీడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మంత్రిగా పనిచేసిన […]

Continue Reading

కొండాపూర్‌లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య

87 Viewsహైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొండాపుర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక (25) అనే యువతి నివాసముంటోంది. హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం చేస్తోంది. మౌనిక మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు […]

Continue Reading

విజయవాడలో ఏసీబీ దాడులు

79 Viewsవిజయవాడః ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రీజనల్‌ మేనేజర్ రామకృష్ణ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కేసులో రామకృష్ణ ఇంటిలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏలూరు, హైదరాబాద్‌, చెన్నైలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏలూరులోని రామకృష్ణ ఇంటిలో రెండు లాకర్లను గుర్తించారు. 8.67 లక్షల నగదు, విలువైన ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రామకృష్ణ సస్పెన్షన్‌లో ఉన్నారు.

Continue Reading

రాయిఘర్‌ ప్రాంతంలో టిఫిన్‌ బాక్స్‌లు

89 Viewsజయపురం: నవరంగపూర్‌ జిల్లా రాయిఘర్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం సరగుడి డీఎన్‌కె గ్రామం రహదారిలో రెండు టిఫిన్‌ బాక్సులలో బాంబులు కనిపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. టిఫిన్‌ బాక్స్‌ బాంబులై ఉండవచ్చని ఆ ప్రాంత ప్రజలు అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఒక బాలుడు రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో కోళ్ల ఫారం సమీపంలో రెండు టిఫిన్‌ బాక్సులు కనిపించగా ఆ విషయం గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వాటిని టిఫిన్‌బాక్స్‌ బాంబులని అనుమానించి పోలీసులకు […]

Continue Reading

కర్నూలు శివారు ప్రాంతాలపై దొంగల టార్గెట్‌

89 Viewsకర్నూలు శివారు ప్రాంత ప్రజలు దొంగల భయంతో వణికిపోతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళితే తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. గార్గేయపురంలో శనివారం రాత్రి ఆరు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించిన విషయం విదితమే. అది కూడా తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే టార్గెట్‌ చేసి..కట్టర్‌తో తాళాలను తెగ్గొట్టి డబ్బు, ఆభరణాలు తస్కరించారు. ఈ చోరీల నేపథ్యంలో శివారు ప్రాంత ప్రజల ఆందోళన రెట్టింపవుతోంది. కర్నూలు రూరల్‌ : కర్నూలు నగరం […]

Continue Reading

బద్వేలులో సవతి తండ్రి దారుణం

88 Viewsబద్వేలు అర్బన్‌ : కంటికి రెప్పలా కూతురిని కాపాడాల్సిన ఓ సవతి తండ్రి కామాంధుడిలా మారాడు. బద్వేలు పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ..తమిళనాడుకు చెందిన చిత్ర అనే ఓ మహిళకు 15 ఏళ్లక్రితం అక్కడే ఓ వ్యక్తితో వివాహమైంది. ఏడాది తర్వాత చిత్ర గర్భవతిగా ఉన్న సమయంలో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చిన చిత్ర నెలల పాపతో జిల్లాలోని ప్రొద్దుటూరుకు వచ్చి పనులు […]

Continue Reading

పట్టపగలే చొరబడ్డాడు!

88 Viewsకర్నూలు, నందవరం: ఓ దొంగ పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనం చేసి ఉడాయిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన సోమవారం నందవరం మండలం గురజాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ వెంకటేష్‌ కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదనుగా తెలంగాణలోని గద్వాలకు చెందిన దొంగ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. రూ.1.30 లక్షల నగదు, 2 తులాల బంగారం దొంగలించాడు. అదే సమయంలో పొలం నుంచి వెంకటేష్‌ కుమారుడు అశోక్‌ […]

Continue Reading

వ్యక్తి దారుణ హత్య: గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత

87 Viewsయాదాద్రి భువనగిరి: ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి(38) దారుణ హత్యను నిరసిస్తూ గ్రామస్థులు, మృతుడి బంధువులు పరుశరాములు అనే వ్యక్తి ఇంటిని తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే… గొలనుకొండ గ్రామానికి చెందిన కన్‌రెడ్డి వెంకటరెడ్డి… భార్య భాగ్యతో కలిసి సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై జనగామకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం సిరిపురం రోడ్డు గుండా స్వగ్రామానికి […]

Continue Reading

జనసేనలో పదవుల భర్తీ ! జేడీ, రాపాకను వదలనంటున్న పవన్

94 Viewsరాజకీయంగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఏదో ఒక రకంగా జనసేన పార్టీని బలమైన పార్టీగా తీర్చిదిద్ది కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు చాలా కాలంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పవన్ ప్రశ్నిస్తూ జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా పార్టీ నాయకుల్లో మనోధైర్యం పెంచాలనే ఆలోచన పవన్ లో ఉంది. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల […]

Continue Reading