భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

84 Viewsహైదరాబాద్: భార్య.. పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిందని.. మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌ శాంతినగర్‌కాలనీలోని కట్టెమైసమ్మ గుడిసమీపంలో సంపంగి చిన్నా(31), భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. పీర్జాదిగూడలోని వీబీ ఫుడ్‌కోర్టులో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కాగా.. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కూడా గొడవ జరగడంతో.. […]

Continue Reading

త్వరలో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా- ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

98 Viewsతెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దీ రోజుల్లో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు డిసెంబర్ 31, మంగళవారం నాడు హుజూర్‌నగర్‌ లో ప్రకటించారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలపై కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, త్వరలో అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటున్నానని అన్నారు. పీసీసీ పదవి కారణంగా సొంత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని, […]

Continue Reading

జనవరి 3నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు-సీఎం వైఎస్ జగన్

87 Viewsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనవరి 3 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. ముందుగా జనవరి […]

Continue Reading

నిర్భయ కేసులో నిందితులకు ఒకేసారి ఉరిశిక్ష

82 Viewsన్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు నిందితులకు అధికారులు ఒకేసారి ఉరిశిక్ష వేయనున్నారు. తిహార్‌ జైల్లో అధికారులు నాలుగు ఉరికంబాలు సిద్ధం చేశారు. ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణం కూడా పూర్తి చేశారు. నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు వినయ్‌, పవన్‌, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌లను ఒకేసారి ఉరితీస్తారు. ఈ నలుగురి డెత్‌ వారెంట్‌పై ఈ నెల 7న పాటియాల కోర్టు తీర్పు వెల్లడించిన విషయం […]

Continue Reading

రాజధానిగా విశాఖ వద్దు.. బెంగళూరు ముద్దు.. తెరపైకి మరో కొత్త డిమాండ్!

78 Viewsఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. అలాగే ఇంకొందరు నేతలైతే ఎవరికి తోచినట్లు వారు కొత్త కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే కోవలో తాజాగా టీడీపీ నేత తీసుకొచ్చిన ప్రతిపాదన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మాకు విశాఖ రాజధాని వద్దు.. బెంగళూరు రాజధాని ముద్దు అంటూ కర్నూలు జిల్లా మంత్రాలయం […]

Continue Reading

రాజధానిపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

83 Viewsఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా అని ప్రశ్నించారు. రాజధాని సిద్ధం కావటానికి వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. రాయలసీమ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ నే అభివృద్ధి చేశారని అన్నారు. రాయలసీమకూ విశాఖపట్నంకు చాలా దూరం ఉన్నా రాజధానిలో పని కేవలం పది శాతం మందికి మాత్రమే ఉంటుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు వస్తుందని తెలిపారు. హైకోర్టులోనూ రాష్ట్ర ప్రజల్లో కేవలం పది శాతం మందికి మాత్రమే […]

Continue Reading

చెట్ల పొదల్లో దాక్కుని దోచేస్తారు

76 Viewsవరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. హయత్ నగర్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు సభ్యుల టీమ్ ను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 150 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో చెడ్డీగ్యాంగ్ ఆరు చోట్ల దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. వారిని పట్టుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని..మొత్తానికి దొరికారని చెప్పిన […]

Continue Reading

పోకిరీలు, ఈవ్‌టీజర్ల.. పనిపట్టారు!

100 Viewsహైదరాబాద్‌ విద్యార్థినులు, యువతులు, మహిళలకు అండదండగా ఉంటున్న షీ బృందాలు ఈ ఏడాదిలో ఫలవంతంగా విధులు నిర్వహించాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు, అవగాహన సదస్సుల ద్వారా షీ బృందం సభ్యుల పనితీరు తెలుసుకుంటున్న బాధితులు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇంతేకాదు.. బహిరంగ ప్రదేశాలు.. బస్‌స్టాప్‌లు.. పర్యాటక ప్రాంతాలు… ఉద్యానవనాలు… కోచింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాలు.. చివరకు దేవాలయాల వద్ద కూడా ‘షి’ బృందం సభ్యులు మాటేసి పోకిరీలను, ఈవ్‌టీజర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ప్రత్యక్షంగా, […]

Continue Reading

రైతులతో జైలుకు వెళ్లేందుకు సిద్ధం

75 Viewsరైతులతో ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం అమలు చేయాలని, ఈ ఒప్పందం అమలుకు రైతులు పోరాటం చేస్తున్నారని దీనిపై రైతులతోపాటు తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 15వ రోజు పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. బుధవారం మంగళగిరి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం మందడంలో జరిగిన ధర్నాల్లో టిడిపి అధినేత చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, ఎన్‌టిఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. మహిళా రైతులకు చంద్రబాబుతోపాటు […]

Continue Reading

పెళ్ల్తెన పదేళ్ల తర్వాత మామ, బావమరిది కిరాతకం

82 Viewsతూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో అమ్మాయి తండ్రి, బావమరిది కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని హతుని సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హతుని సోదరుని కథనం ప్రకారం… రామభద్రపురం మండలం తోటపేటకు చెందిన బిసి యువకుడు పంపన సత్యవెంకటేశ్వరరావు (33), అదే ప్రాంతానికి చెందిన ఒసి యువతి చైతన్య పదేళ్ల క్రితం కులాంతర వివాహం […]

Continue Reading