రేపు హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు

19 Viewsరేపు నగరంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్, రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ దారి మళ్లించారు. శనివారం(ఫిబ్రవరి 1) రాష్ట్రపతి బేగంపేట్ విమానాశ్రయం చేరుకోనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు.

Continue Reading

కెసిఆర్ ప్రధాని కావాలంటే ఏం చేయాలి..!!

17 Viewsతెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులే బహిరంగంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే తరుణంలో మరికొంతమంది మంత్రులు కెసిఆర్ ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రధాని అయితే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారని దేశం అబివృద్ది చెందాలంటే కెసిఆర్ ప్రదాని కావాలని, కెటిఆర్ తెలంగాణ […]

Continue Reading

నూతన పద్దతిలో వ్యవసాయం చేయాలి: దత్తాత్రేయ

22 Viewsరైతులు నూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్ దత్తాత్రేయ చెప్పారు. మెదక్ జిల్లాల్లోని కౌడిపల్లి మండలం తునికిలో కృషివిజ్ఞాన కేంద్రాన్ని దత్తాత్రేయ సందర్శించారు. సేంద్రీయ ఎరువులతో వ్యయసాయం చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గోవుల సంరక్షణ కోసం రూ. 25 వేలు ఇస్తున్నామని దత్తాత్రేయ తెలిపారు.

Continue Reading

హైదరాబాద్‌లో పెరుగుతున్న ‘కరోనా’ అనుమానితులు

22 Views హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిసోస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతుంది. నగరంలోని గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, ఫీవర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా వైరస్‌ అనుమానితులు చేరారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 15 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పుణె ల్యాబ్‌కు పంపిన 11 శాంపిల్స్‌లో 9 మందికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని.. మరో ఇద్దరి రిపోర్ట్‌ రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Continue Reading

“అమ్మ వోడి డబ్బులపై క్లారిటీ”.. డబ్బు ఇవ్వడం తప్పనిసరి కాదట.. !!

16 Viewsజగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పధకం చదువుకునే ప్రతి ఒక్కరికి అండగా నిలిచింది.. ఏడాదికి పదిహేనువేల రూపాయిల చొప్పున ప్రతి చదువుకునే విద్యార్థి కి ఆర్థిక సహాయం కింద ఇచ్చారు..అయితే ఆర్థికసాయం పొందిన తల్లిదండ్రులు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున స్కూలు టాయిలెట్ల నిర్వహణకు విరాళం ఇవ్వాలని ప్రభుత్వం తరుపున ఒక వాదన వచ్చింది… అయితే కొంతమంది తల్లితండ్రులు దీనికి సమ్మతంగా లేరు.. అయితే ఇలా ఏడాదికి వెయ్యి రూపాయలు అందజేయాలన్న నిబంధన తప్పనిసరి కాదని […]

Continue Reading

జేసీ దివాకర్‌కు దిమ్మతిరిగే షాక్

23 Viewsమాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఒకవైపు పోలీసు కేసులు మరోవైపు ట్రావెల్స్ బస్సుల సీజ్ కొనసాగుతుండగానే జేసీపై మరో పిడుగు పడింది. ఆయనకు జగన్ ప్రభుత్వం ఈసారి గట్టి దెబ్బ కొట్టింది. జెసి సోదరులకు చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికిలోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి గతంలో ఇచ్చిన లీజులను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. యాడికిలోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే […]

Continue Reading

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

23 Viewsకడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిట్వేలి మండలంలోని, పుల్లంపేట ఘాట్ రోడ్డులో మినీ ట్రాన్స్ పోర్ట్ ఆటో బోల్తా పడటంతో 8 మందికి తీవ్ర గాయాలు అవ్వగా ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలలోకి వెళితే..నెల్లూరు జిల్లా గూడూరు సంత నుంచి 30 గొర్రెలతో పాటు 18 మంది మినీ ట్రాన్స్ పోర్ట్ ఆటోలో శుక్రవారం పుల్లంపేటకు వస్తుండగా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని 108లో రాజంపేట […]

Continue Reading

‘జగనన్న చేదోడు’.వారికి ఏడాదికి రూ. 10వేలు..!

20 Viewsసీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమాజంలోని పలు వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. గతేడాది ఆటో, టాక్సీ వాలాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేశారు. తాజాగా ఆయన మరికొన్ని బడుగు వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం. టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 10వేల సాయం చేయడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ […]

Continue Reading

ఆ రూ. 234 కోట్లు ఏమయ్యాయి…!!

15 Viewsఅధర్మం ఎన్నికుట్రలు, కుతంత్రాలుచేసినా అంతిమవిజయం ధర్మానిదేనని, రాజధాని అమరావతిని విచ్ఛిన్నంచేసి, తమపబ్బం గడుపుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వ అనైతికచర్యలకు, ఆకృత్యాలకు పవిత్రమైన పదవిలోఉన్న వై.వీ.సుబ్బా రెడ్డిలాంటి వాళ్లు భాగస్వాములుకావడం సిగ్గుచేటని టీడీపీనేత, రాష్ట్రబ్రాహ్మణకార్పొరేషన్‌ మాజీఛైర్మన్‌ వేమూరిఆనంద్‌సూర్య మండిపడ్డారు. ప్రపంచప్రఖ్యాతిపొందిన తిరుమ ల తిరుపతి క్షేత్రం ఛైర్మన్‌గా ఉండాల్సిన వ్యక్తికి, శాసనమండలిలో గ్యాలరీలో ఏంపని అని వేమూరి ప్రశ్నించారు.

Continue Reading

కేంద్ర బడ్జెట్‌లో కీలకాంశాలు ఇవే

18 Viewsఏటా లక్షల కోట్ల బడ్జెట్..అంతా ప్రజల కోసమే. సామాన్యుడి కష్టాలు తీర్చేందుకే…మధ్య తరగతి వర్గం బతుకును బాగు చేసేందుకే. కానీ ఆ లక్ష్యాలు సామాన్యుడి వరకు చేరడం లేదు. ఆ హామీలు..మధ్య తరగతి జీవుల కష్టాలను తీర్చడం లేదు. కొన్ని హామీలు పేపర్లకే పరిమితమైతే..మరికొన్ని పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడ తేడా కొడుతోంది…పాలకుల హామీల్లోనా…? బడ్జెట్‌ రూపకల్పనలోనా…? 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్ధిక స్థితినే మార్చివేశాయి.

Continue Reading