మద్యం కొనాలంటే కార్డు కావాల్సిందే.. ధర రూ.5 వేలు!? జగన్ నిర్ణయం

83 Viewsఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. ఈ నేపథ్యంలో ఇకపై మద్యం ఎవరైనా కొనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చేజ్ కార్డును తప్పనిసరిగా కొనుగోలు చేయాలట. ఈ కార్డు పొందాలంటే రూ.5 వేలు చెల్లించాల్సివుంటుంది. అంతేకాదండోయ్… […]

Continue Reading

కడపలో హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ పేరిట కొత్త సంస్థకు శ్రీకారం..

81 Viewsఏపీ ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ పేరిట కొత్త సంస్థకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెండు ఉత్తర్వులు విడుదల చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు కంపెనీ అని స్పష్టం చేస్తూ రూ.10 లక్షల మూల ధనం కేటాయించారు. ఇన్‌క్యాప్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, మైన్స్‌ అండ్‌ జియాలజీ కార్యదర్శి కె రాంగోపాల్‌ను కంపెనీ డైరెక్టర్లుగా నియమించింది. రాష్ట్ర పునర్నిర్మాణ చట్టంలో పేర్కొన్న కడప […]

Continue Reading

పోలీసులకు గ్రూప్ ఇన్సూరెన్సు పెంచిన ఏపీ ప్రభుత్వం

87 Viewsసీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాదాల సమయంలో పోలీసులకు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని పెంచారు. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులు రూ.4.74కోట్ల చెక్కును న్యూ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీకి అందజేశారు. ఈ ఇన్సూరెన్స్, ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులకు ఉపయోగపడనుంది. దీని ద్వారా డీఎస్పీ, ఆ పై అధికారులకు రూ.45లక్షలు.. ఎస్‌ఐ, సీఐలకు రూ.35లక్షలు.. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లకు రూ.13లక్షల ఇన్సూరెన్స్ వర్తించనుంది. అలాగే […]

Continue Reading

పార్టీ మారాలనే ఆలోచన లేదు: గంటా

92 Viewsటీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై గంటా స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని, పార్టీ మారాలనే ఆలోచనే తనకు లేదని చెప్పారు. తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ సమావేశాలను నిర్వహించబోతున్నట్టు తెలిపారు. గంటా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి ఆయన రాకను తీవ్రంగా […]

Continue Reading

రైతులకు కోపం వస్తే నేతల్ని పొలంలో పని చేయిస్తారు!

97 Viewsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్తున్న తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని.. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదన్నారు. జనసేన తరపున రైతుల కోసం పోరాటం చేస్తానన్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా.. పవన్ కళ్యాణ్ మదనపల్లె మార్కెట్ యార్డ్‌కు వెళ్లారు.. టమోటా రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్డున పడుతున్నారని మండిపడ్డారు జనసేనాని. […]

Continue Reading

రైతుల పొట్ట కొట్టిన వ్యక్తి చంద్రబాబు

85 Viewsఅమరావతి: మరోసారి రాజధానికి వెళ్లే ధైర్యంలేకే చంద్రబాబు నాయుడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవాడలో పెట్టుకున్నాడని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పై రాళ్లు ఎందుకు పడుతున్నాయని విమర్శించారు. రకరకాల విన్యాసాలతో రైతుల పొట్ట కొట్టిన వ్యక్తి చంద్రబాబని ఆమె విమర్శించారు. చంద్రాబాబు దళిత ద్రోహి అని దళితుల ఎస్సెన్డ్‌ భూములు లాక్కుని అన్యాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల్ని పక్కన ఏనాడు […]

Continue Reading

అమరావతి కల్ప వృక్షం వర్సెస్ అమరావతి మయసభ?

92 Viewsఈరోజు విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరగగా తుళ్లూరులో రైతుల, కూలీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అమరావతిలో ఏం జరుగుతోందో తెలిపేందుకే అని చంద్రబాబు అన్నారు. భావి తరాల భవిష్యత్ అమరావతి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజలందరిపై అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజా చైతన్యం […]

Continue Reading

దిశ కేసులో సంచలనం… మరో ముగ్గురి అరెస్టులు

85 Viewsదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ ఘటనలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. దిశ అత్యాచారం, హత్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంలేదని సోషల్ సైట్లలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై మరికొందరు ఫేస్‌బుక్, ట్విట్టర్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే సీఎం కూతురు మాజీ ఎంపీ కవితపై సోషల్ మీడియాలో కొందరు యువకులు అభ్యంతరకరంగా పోస్టింగ్స్ చేయగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదిలాఉండగా, మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు […]

Continue Reading

డిసెంబర్ 6న ’90 ML’ చిత్రం విడుదల

89 Viewsహీరో కార్తికేయకి `ఆర్ఎక్స్‌100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర తో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన `90 ml` ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి, ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన […]

Continue Reading

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి!

84 Viewsమధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం రేవా జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్ ను ఢీకొనడంతో ఆరు నెలల బాలునితో సహా 15 మంది ప్రయాణికులు మరణించారు, 10 మంది గాయపడ్డారు. ఉదయం 6:30 గంటల సమయంలో రేవాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటన తరువాత బస్సు డ్రైవర్ అక్కడి […]

Continue Reading