విశాఖలో కలకలం.. పోలీస్‌ను కత్తితో వెంబడించిన తాగుబోతు

72 Viewsవిశాఖపట్టణంలో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. వుడా చిల్డ్రెన్ థియేటర్ వద్ద మద్యం మత్తులో న్యూసెన్స్ చేశాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడిని వారించే ప్రయత్నం చేశాడు. దాంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఓ డమ్మీ కత్తిని చూపించి పోలీసును బెదిరించాడు. నన్నే తిడతావా.. పొడిచేస్తానంటూ కత్తితో వెంబడించాడు. నవంబరు 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీపీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడినిఅరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Continue Reading

గుంటూరు జిల్లాలో కాల్ మనీ వేధింపులు… కోరిక తీర్చాలంటూ…

67 Viewsఎంతోమంది అమాయకులను బలితీసుకున్న కాల్ మనీ కేటుగాళ్లు… ఇంకా తమ కార్యకలాపాలను కొనసాగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని… తన కోరిక అయినా తీర్చాలని అజిమున్నీసా అనే మహిళపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చారు. వారి ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు… ఎస్పీ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను గుంటూరు జీజీహెచ్ […]

Continue Reading

కన్నతల్లిపై కూతురు కక్ష.. 20వేల సుపారీ!

87 Viewsనల్లగొండ: తల్లిపై కూతుర్లు కక్షగట్టిన అమానవీయ సంఘటన ఇది. హైదరాబాద్ లో టీనేజీ యువతి తల్లిని హత్య చేసిన ఘటన తర్వాత.. అలాంటి అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఇద్దరు కూతుర్లు తల్లిని హత్య చేసిన ఘటనలో మానవ సంబంధాలు పక్కదారిపట్టిన తీరు ఆందోళనకు గురి చేస్తుంది. నల్లగొండ రూరల్‌ మండలం అప్పాజీపేటలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఇది. అప్పాజీపేటకు చెందిన కల్లూరి సత్యమ్మ వయసు 55 ఏళ్లు. ఆమెకు ఆండాలు, రుద్రమ్మ అనే […]

Continue Reading

సాంకేతిక సమస్యలను దూరం చేస్తాం

131 Viewsఆదోనిమార్కెట్‌: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్ సుధాకర్‌ మంగళవారం పర్యటించారు. యార్డు మొత్తం కలియ తిరిగి పంట దిగుబడుల వివరాలను, ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని మార్కెట్‌ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రంలో అంతర్జాలంలో నెలకొని ఉన్న సాంకేతిక సమస్యలను దూరం చేస్తామన్నారు. ఇందుకు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ టాటా కన్సల్టెన్సి సర్వీస్ సంస్థతో సమస్యల అధిగమనకు ఒప్పందం […]

Continue Reading

వైకాపా నాయకులు దోపిడీకి తెరలేపారు:కాల్వ

87 Viewsకర్నూలు: రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగుతోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ… రాష్ట్రం పేరు చెబితేనే పారిశ్రామిక వేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు దోపిడీకి తెరలేపారని విమర్శించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోయాయని చెప్పారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంత చెడ్డ […]

Continue Reading

వేరుశనగనుమద్దతు ధరకు కొనాలని ధర్నా

86 Viewsఎమ్మిగనూరు వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట వేరుశనగను ఆయిల్ ఫెడ్‌ సంస్థ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతు నెల క్రితం మార్కెట్‌లో వేరుశనగ క్వింటాకు రూ.8500 ధర పలకగా ఇప్పుడు సగం మేర తగ్గిందని అన్నారు. వేరుశనగ ధర పడిపోవడంతో రైతులకు పెట్టుబడి రావడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర అందించి […]

Continue Reading

ఆ నాయకుడు చేరికతో కర్నూల్ లో టీడీపీ ఆఫీస్ మూసేసుకోవచ్చేమో

81 Viewsరాయలసీమలో కడప జిల్లా వైసీపీ పార్టీకి ఎంత పట్టు ఉంటుందో రాయలసీమలో కర్నూల్ జిల్లా కూడా అంతే పట్టు ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికలలో కర్నూల్ జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యేలు, రెండు పార్లమెంట్ స్థానాలను అత్యధిక మెజారిటీతో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు. గత ముప్పయేళ్ళుగా కేయి, కోట్ల కుటుంబాల మధ్య వైరాన్ని మర్చిపోయి వారి వారి రాజకీయ అవసరాల కోసం కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే మొత్తం ఓట్లు గంపగుత్తగా పడతాయని […]

Continue Reading

డీఎస్సీ-2008 పై త్వరలో నిర్ణయం: మంత్రి సురేశ్

79 Viewsడీఎస్సీ-2008కి సంబంధించి ఉద్యోగాల భర్తీలో సమస్యలు ఉన్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ ద్వారా ఎంపికైన 4657 మంది ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి స్పందించారు. అభ్యర్థుల పైలును న్యాయవిభాగానికి పంపించామని వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. మరికొన్నిరోజుల్లో టెట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఫీజుల నియంత్రణ అమలు చేయాలేకపోయామని వివరించారు. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ను […]

Continue Reading

టీపీసీసీ పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.?

83 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కు సరిపడా సీట్లు కూడా గెలవలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ పిసిసి అధ్యక్షుడు మార్పు అంశం తెరమీదకి వచ్చింది. టిపిసిసి పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన వ్యక్తి కాదు కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ రాణించలేక పోతోంది అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా… టిపిసిసి […]

Continue Reading

సమ్మె ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అశ్వత్థామరెడ్డి.

74 Viewsగత 46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎంత చెప్పిన సరే ఆర్టీసీ జెఏసి వినకుండా సమ్మెలోకి దిగింది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం ఏమాత్రం మెట్టు దిగకుండా ఉండిపోయింది. తాజాగా హైకోర్టు సైతం ఈ వివాదం ఫై చేతులెత్తిసింది. దీంతో తదుపరి కార్య చరణ ఏంటి అనేది నవంబర్ 19 సాయంత్రం తేల్చి చెపుతామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. దీంతో జేఏసీ ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంత […]

Continue Reading