నీటితో నిండిన లక్ష్మి బ్యారేజ్

10 Viewsహైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో మొదటిసారిగా నీటిమట్టం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి 16.2 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. దీంతో 11 మోటార్ల ద్వారా నీటిని ఎగువకు ఎత్తిపోశారు అధికారులు. గత ఏడాది నవంబరు 21 నుంచి పూర్తిస్థాయిలో లక్ష్మీ బ్యారేజీ గేట్లను మూసివేసి నీటిని నిలువ చేశారు. మళ్లీ మూడు నెలల […]

Continue Reading

కిమ్స్-లివ్లైఫ్ సెంటర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు

12 Viewsకిమ్స్‌-లివ్‌లైఫ్‌ సెంటర్‌ మొదటి వార్షికోత్సవ వేడుకలను మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ ఐటి క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఊబకాయం నుంచి బయటపడిన వారితో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. నటి ప్రియాంక శర్మ, సోషలైట్‌ శ్రీదేవి చౌదరి, పద్మశ్రీ డాక్టర్‌ మంజుల అనగని, కిమ్స్‌ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ బీ భాస్కర్‌ రావు, డాక్టర్‌ నందకిషోర్‌ దుక్కిపాటి, ఎంఎస్‌ వాసుప్రద, అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నెస్లే హెల్త్‌ […]

Continue Reading

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ.సోమయ్య

12 Viewsఒక ప్రాంతం, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే యువత కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పీ.సోమయ్య అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేశ్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన యువజన సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో 40శాతం పైగా ఉన్న యువత అన్నివిధాలా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను యువత గమనిస్తూ ఉండాలని సూచించారు. శాస్త్ర, సాంకేతిక […]

Continue Reading

ముస్తక్ మాలిక్ అరెస్ట్ అప్రజాస్వామికం

12 Viewsఎన్నార్సీని వ్యతిరేకిస్తు శాంతియుతంగా నిరసనలకు పిలుపునిచ్చిన మిలియన్‌ మార్చ్‌ కన్వీనర్‌ ముస్తక్‌ మాలిక్‌ను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ నాయకులు అజిజ్‌ పాషా అన్నారు. మాలిక్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓయూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి మాలిక్‌ను పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్‌ వలి ఉల్లా ఖాద్రి, ఏఐఎస్‌ఎఫ్‌ ఓయూ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Continue Reading

ఆకట్టుకున్న పెన్సిల్ స్కెచ్ ఎగ్జిబిషన్

13 Viewsసీఎం కేసీఆర్‌ 66వ జన్మదినం సందర్భంగా మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన పెన్సిల్‌ స్కెచ్‌ ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్‌ అరుదైన చిత్రాలను, ప్రజా జీవితంలోని చారిత్రాత్మక ఘటలకు సంబంధించిన చిత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. మాదాపూర్‌లోని ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 ఏండ్ల స్వరాష్ట్ర ఉద్యమం మాదిరిగానే, ఆరేండ్లుగా రాష్ట్రంలో ఒక ఉద్యమంలా ప్రగతి సాధిస్తూ దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా నిలిపిన ఘనత సీఎం […]

Continue Reading

ఓ స్కూల్‌ టీచర్‌లాగా డ్రైవింగ్‌లో ట్రైనింగ్‌

15 Viewsడ్రైవింగ్‌ స్కూల్‌ అంటే మాములుది కాదు. రూ.కోట్లు పెట్టి ఈ స్కూళ్లు పెడుతున్నారు. నగరంలోని డ్రైవింగ్‌ స్కూళ్ల మధ్య తీవ్ర పోటీ పెరిగింది. డ్రైవింగ్‌ స్కూళ్లు అంటే వ్యాపార ధోరణిగా మారిపోయాయి. అలా కాకుండా ప్రజాసేవ మాదిరిగా ఉండాలి. ఒకే దగ్గర కాకుండా.. అవసర మైన చోట డ్రైవింగ్‌ స్కూళ్లు పెట్టాలి. పోటీతత్వమనేది మంచి సబ్జెక్టు, డ్రైవింగ్‌, శిక్షణను శిక్షణార్థులకు ఇవ్వడంలో ఉండాలి. భవిష్యత్తులో డ్రైవింగ్‌ స్కూళ్లు విషయంలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నాం. నామ్‌కే వాస్త్‌ […]

Continue Reading

రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

13 Viewsహైదరాబాద్‌: రేపటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు ప్రారంభం కానుంది. హెచ్‌ఐసీసీలో మూడురోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 37 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

Continue Reading

పోలీసులపై తిరగబడిన మందుబాబులు

14 Viewsవరంగల్‌: మద్యం మత్తులో పోలీసులపై మందు బాబులు తిరగబడి, దాడికి పాల్పడిన సంఘటన శనివారం ఉర్సు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ ఎస్సై భీమేష్‌ కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉర్సుగుట్ట ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తుండగా విధులు నిర్వహిస్తున్న బ్లూకోడ్స్‌ సిబ్బంది మద్యం సేవిస్తున్న యువకులను బహిరంగ మద్యం సేవించకూడదని వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. కాగా, ఘటన స్థలానికి ఇంటర్‌సెప్టర్‌ వాహనంలో […]

Continue Reading

ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు…

13 Viewsకొత్తపల్లి: కరీంనగర్‌ వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో తొమ్మిదో వార్డు అభ్యర్థి ఉల్లెందుల లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. 9వవార్డు ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ చేయగా నాగులమల్యాల గ్రామానికి చెందిన ఉల్లెందుల లక్ష్మి, నాయిని రాజ్యలక్ష్మి బరిలో నిలిచారు. మొత్తం 121 ఓట్లు పోలవగా, ఉల్లెందుల లక్ష్మికి 60, నాయిని రాజ్యలక్ష్మికి 59ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఒకబ్యాలెట్‌లో రెండు గుర్తులపై ఓటు వేయగా, మరోదానిలో ఎలాంటి ఓటు వేయకుండా […]

Continue Reading

కేంద్ర బడ్జెట్ ఓ బూటకం

12 Viewsకేంద్రబడ్జెట్‌ ఓ బూటకమనీ, పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకమనీ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌ విమర్శిం చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈనెల ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, సంపన్నుల కోసమేనని అన్నారు. సంపద సృష్టించే పేదలు, రైతులు, కార్మికులకు ఈ బడ్జెట్‌ వ్యతిరేకమని చెప్పారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను కేంద్రం ఉపసంహ రించుకుంటోందని అన్నారు. బీపీసీఎల్‌, ఎల్‌ఐసీలో పది శాతం […]

Continue Reading