అమిత్‌ షాతో నిరసనకారుల భేటీకి నిరాకరణ

15 Viewsన్యూఢిల్లీ/పనాజి : చర్చల గొప్పలు అంతలోనే తుస్సుమన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై షహీన్‌బాగ్‌ నిరసనకారులతో సహా ఎవ్వరితోనైనా చర్చలకు తాను సిద్ధమని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంతలోనే ముఖం చాటేశారు. ఈ అంశంపై చర్చేందుకు వచ్చేవారికోసం తమ కార్యాలయ తలుపులు తెరివుంటాయని ప్రకటించిన ఆయన..ఇప్పుడు అనుమతుల పేరుతో అడ్డు చెబుతున్నారు.

Continue Reading

నేనందరి ముఖ్యమంత్రిని!

17 Viewsన్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పైన, తన పార్టీపైనా తీవ్ర ఆరోపణలు గుప్పించిన ప్రత్యర్థులను క్షమించివేస్తున్నానని ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో అంగరంగవైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ చేత లెఫ్టినెంట్‌ గవర్నరు అనిల్‌ బైజల్‌ ప్రమాణం చేయించారు ఆయనతో పాటే ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణస్వీకారోత్సవ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన […]

Continue Reading

ఓటింగ్‌కు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

17 Viewsబనశంకరి (బెంగళూరు): దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక ఇంటర్నెట్‌ లైన్ల ద్వారా వెబ్‌ కెమెరా, ఓటరు వేలిముద్రలను ఉపయోగించుకొని ఓటరును నిర్ధారించుకుంటారు. అనంతరం టూ వే ఎలక్ట్రానిక్‌ […]

Continue Reading

కేజ్రీ ప్రమాణానికి ‘మినీ మఫ్లర్‌మ్యాన్‌’

16 Viewsదిల్లీ: ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేక అతిథి రానున్నారట. ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్‌ గెటప్‌లో కన్పించి తెగ వైరల్‌ అయిన ‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ‘సిద్ధంగా ఉండు జూనియర్‌!’ అని […]

Continue Reading

‘వాలంటైన్స్‌ డే’ వేడుకలు నిషేధం

13 Viewsఇండోనేసియాలోని బాండా ఆచ్చే నగరంలో ‘వాలంటైన్స్‌ డే’ వేడుకులను శుక్రవారం నాడు నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఆ నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధమంటూ నగర మేయర్‌ అమీనుల్లా ఉస్మాన్‌ ఉత్తర్వులు జారీ చే శారు. హోటళ్లలో, రెస్టారెంట్స్‌లో, మరే ఇతర వేదికలపై వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఇలాంటి వేడుకలకు యువతీ యువకులు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Continue Reading

గూగుల్‌ మ్యాప్‌లో పెళ్లి ప్రపోజల్‌

17 Viewsబెర్లిన్‌: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. […]

Continue Reading

కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్.. ఎవరీయన..?

13 Viewsలండన్: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్‌ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిని సాజిద్ జావిద్ చేపట్టారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఆయన రాజీనామా చేశారు. గతేడాది జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషి సునక్ ఆర్థికశాఖ మంత్రిగా నియమితులైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. రిషి సునక్ కొత్త ఆర్థికశాఖ మంత్రిగా రిషి సునక్

Continue Reading

ట్రంప్ భారత పర్యటన వెనుక… “అసలు సీక్రెట్ ఇదీ”…!!!

13 Viewsఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వెనుకాల పెద్ద తతంగమే ఉందని అంటున్నారు నిపుణులు. ఊరకే రారు మహానుభావులు అన్నట్టుగా..సహజంగానే వ్యాపారవేత్త అయిన ట్రంప్ లాభం లేకుండా ఏ పనిచేయడు అంటూ గుసగుస లాడుతున్నారు. క్షణం తీరికలేని ట్రంప్, అందులోనూ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రచార హడావిడిలో ఉండే ట్రంప్ ఒక్క సారిగా భారత పర్యటన చేపట్టడానికి ప్రధానకారణం ఏమిటంటే..

Continue Reading

16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

18 Viewsఢిల్లీ: ఈనెల 16వతేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ కాసేపట్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

Continue Reading

భారత్ పర్యటన ఖరారు

14 Viewsఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించింది. ట్రంప్‌ భారత్‌కు రాడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాతో కలిసి భారత్‌కు రానున్న ట్రంప్‌.. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్‌ వెల్లడించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆకాంక్షించారు. […]

Continue Reading