ఆంధ్రప్రదేశ్

15 నియోజకవర్గాలకు బోర్‌ రిగ్గులు

3 Viewsవైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద జిల్లాలోని 15 నియోజకవర్గాలకు బోర్‌ రిగ్గులను అందించినట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించేందుకు కలెక్టరేట్‌ నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో పాటు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కాసు మహేష్‌రెడ్డి, కిలారి రోశయ్య, నంబూరు శంకరరావు, ముస్తఫా, వి.రజని పాల్గొన్నారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలో జలకళ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా […]

మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు

10 Viewsఅమరావతి: ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో మొదటి దశలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అమూల్‌ సహకారంతో పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ‘వైఎస్సార్‌ చేయూత’ లబ్ధిదారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమంపై తన సహచర మంత్రులతో కలిసి అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, సీదిరి […]

తెలంగాణ

కోవిడ్ పట్ల మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి

3 Viewsమహిళలపై కరోనా వైరస్‌ పెద్దగా ప్రభావం చూపదని భావించినప్పటికీ, ప్రస్తుత క్లిష్టపరిస్థితులలో సంతాన సాఫల్యత, గైనిక్‌ సమస్యలపై వైద్యులను సంప్రదించడానికి మహిళలు వెనకడుగు వేస్తున్నారని ప్రొఫెసర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రూమా సిన్హా అన్నారు. గర్బిణీలకు ఇతర సాధారణ ప్రజల కంటే ఎక్కువ ప్రమాదం ఏమీ లేదని, కోవిడ్‌-19 వలన గర్భóధారణ ఫలితాలు ఏమాత్రం ప్రతికూలంగా ప్రభావితం కావని ఇప్పటి వరకు జరిపిన పలు పరిశీనలు సూచిస్తున్నాయన్నారు. వాస్తవానికి వారు మిగతా ప్రజల మాదిరిగానే […]

క్రైమ్

చిన్న గొడవలో యువకుడి హత్య

3 Viewsచిన్న గొడవ విషయంలో సర్దిచెప్పడానికి వెళ్లిన సమయంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూన్‌ పేట పోలీసుల వివరాల ప్రకారం విమానపురి కాలనీకి చెందిన పవన్‌, పావని దగ్గరి అన్నా చెల్లెలు. వారు బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా సందీప్‌ అనే యువకుడు వారి పక్క నుండి వచ్చి బైక్‌ పై నుండి కింద పడ్డాడు. దాంతో ఆవేశానికిలోనై సందీప్‌ పవన్‌ వెళ్తున్న బైక్‌ వల్లే […]

క్రీడలు

లక్ష్య ఛేదనలో రికార్డు సృష్టించిన రాజస్థాన్…

6 Viewsహైదరాబాద్: క్రికెట్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని, మనదైన రోజున ఎవరూ ఆపలేరని రాజస్థాన్ రాయల్స్ నిరూపించింది. పంజాబ్ తమ ఎదుట ఉంచిన కొండంత లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని బ్యాట్స్‌మెన్ శివాలెత్తిపోయారు. షార్టాలో పరుగుల వాన కురిపించారు. దీంతో ఇరు జట్లలోని బౌలర్లు పరుగులు భారీగా సమర్పించుకున్నారు. 85 పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన […]

ఐపీఎల్‌లో ఈ రికార్డు అజరామరం.. ఎప్పటికీ అంతం కాకపోవచ్చు!

8 Viewsఒక బౌలర్ ఒక ఓవర్లో 37 పరుగులు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం కానీ.. ఐపిఎల్‌లో ఇది సాధ్యం అయ్యింది. ఈ రికార్డు ఎప్పటికీ అంతం కానిది కావచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం. ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఒక జట్టు అత్యధిక పరుగులు చేసిన రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కలిగి ఉంది. 2013లో 263/5 పరుగులు చేసిన ఆర్‌సిబి ఈ రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఒకే ఓవర్‌లో 37 పరుగులు అంటే దాదాపు అసాధ్యమే.. […]

సినిమా

విలన్ గా మారనున్న పూర్ణ..!

11 Viewsఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన పూర్ణ తాజాగా విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూర్ణ నటించనున్నట్లు సమాచారం. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో పూర్ణ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పూర్ణ తన మేక్ఓవర్ ను కూడా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. […]